వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2022: శనివారం..అమావాస్యకు తోడు తొలి సూర్యగ్రహణం: ఈ రాశుల వారిపై

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ నెల 30వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సంవత్సరంలో ఇదే తొలి సూర్యగ్రహణ కాలం.. శనివారం రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. దీన్ని అశుభంగా పరిగణిస్తోన్నారు వేద పండితులు. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుంటుందని చెబుతున్నారు. దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని సూచిస్తోన్నారు.

శని అమావాస్య నాడే.. సూర్యగ్రహణం

శని అమావాస్య నాడే.. సూర్యగ్రహణం

హిందూ ధర్మశాస్త్రాల్లో అమావాస్య, శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజును శని అమావాస్య లేదా శనిశ్చరీ అమావాస్యగా పిలుస్తుంటారు. కొన్ని చోట్ల అమావాస్య రోజున పాలు కూడా కొనరు. శనివారం నాడు వంటనూనె ఆధారిత వస్తువులను తీసుకోరు. ఇప్పుడీ రెండింటితో కలిసి సూర్యగ్రహణం రాబోతోంది. ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఇదే. ఇది పాక్షిక సూర్యగ్రహణం. అయినప్పటికీ.. కొన్ని రాశులపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

నాలుగు గంటలపాటు..

నాలుగు గంటలపాటు..

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. భారత్‌లో ఈ సూర్యగ్రహణం అర్ధరాత్రి 12:15 నిమిషాలకు ఆరంభమౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్లవారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు మరింత సమయం తీసుకుంటుంది.

భారత్‌లో కనిపిస్తుందా..?

భారత్‌లో కనిపిస్తుందా..?

భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ- పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియ నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తెలిపింది. నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది.

ఏఏ రాశులపై ప్రభావం..

ఏఏ రాశులపై ప్రభావం..

శని అమావాస్య, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం..మూడు రాశులపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. మేషం (Aries), కర్కాటకం (Cancer), ధనస్సు (Sagittarius) రాశుల వారిపై దీని దుష్ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషిస్తోన్నారు. గ్రహణ ప్రభావంతోో వారికి అనారోగ్యం, మానసిక ఒత్తిడి సంభవించే అవకాశం ఉందని, ధన నష్టం కలుగుతుందని జోస్యం చెబుతోన్నారు. చేయాలనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాలేకపోవచ్చనీ అంచనా వేస్తోన్నారు.

ఉద్యోగ, వ్యాపారరంగంలో..

ఉద్యోగ, వ్యాపారరంగంలో..

వ్యాపార రంగంలో ఉన్న వారు ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరింత శ్రమపడాల్సి ఉంటుందని పండితులు అంచనా వేస్తోన్నారు. మేష రాశి వారు మానసికంగా అశాంతికి గురవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని పండితులు స్పష్టం చేస్తున్నారు. గ్రహణ కాలంలో ఈ మూడు రాశుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని, దీనికి విరుద్ధంగా వెళ్తే తుది ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయని హితబోధ చేస్తోన్నారు.

English summary
Surya Grahan 2022: Across the world set to witness first Solar Eclipse on April 30. It is going to be a partial solar eclipse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X