Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమాయకురాలిని , సుశాంత్ డ్రగ్స్ కోసం అందర్నీ వాడుకునేవాడు .. బెయిల్ పిటీషన్ లో రియా

బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టయిన సుశాంత్ సింగ్ రాజ్ పూత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బొంబాయి హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉండగా ముంబైలో భారీ వర్షాల కారణంగా హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. నిన్నటికి నిన్న అక్టోబర్ ఆరో తేదీ వరకు రియా చక్రవర్తి జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రియా చక్రవర్తి

బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రియా చక్రవర్తి

జూన్ 14 న రియా చక్రవర్తి బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకోవటంతో , అతని మృతిపై దర్యాప్తుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు. రియా చక్రవర్తి ని డ్రగ్ సిండికేట్ యొక్క కీలక సభ్యురాలిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది .ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు . అయితే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా పదేపదే రియా చక్రవర్తి కి బెయిల్ నిరాకరిస్తున్నప్పటికీ మళ్లీ మళ్లీ బెయిల్ కోసం రియా చక్రవర్తి ప్రయత్నం చేస్తూనే ఉంది.

అమాయకురాలిని , నార్కోటిక్స్ ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించింది

అమాయకురాలిని , నార్కోటిక్స్ ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించింది

తను అమాయకురాలినని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఉద్దేశ పూర్వకంగానే తనతోపాటు తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని రియా చక్రవర్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారని తెలుస్తుంది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందం అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణ కారణంగా ఇప్పటికే తన మానసిక ఆరోగ్యం ఇబ్బందికరంగా మారిందని ఆమె పిటిషన్లో పేర్కొన్నట్లుగా సమాచారం.

 రియా పరిచయం కాక ముందు నుండే సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ?

రియా పరిచయం కాక ముందు నుండే సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ?

అంతేకాదు తాను పరిచయం కాక ముందు నుండే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ అలవాటు ఉందని, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే తాను సుశాంత్ కు డ్రగ్స్ అందించానని, అది కూడా తన సొంత డబ్బుతో కొనుగోలు చేశానని రియా చక్రవర్తి తన పిటీషన్లో వెల్లడించినట్లుగా సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తన డ్రగ్స్ అలవాటును కొనసాగించటానికి తన సన్నిహితులను వాడుకున్నారని , తాను కూడా అలాగే తన కోసం డ్రగ్స్ అందించానని రియా పేర్కొన్నారని తెలుస్తుంది. రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోయిక్ బెయిల్ అభ్యర్థనలను రేపు బొంబాయి హైకోర్టు విచారించనుంది.

Recommended Video

    Deepika Padukone : మాల్ ఉందా..? Deepika Padukone.. వాట్సాప్ చాట్‌ లీక్! || Oneindia Telugu
    తనను , తన సోదరుడ్ని , ఇంట్లో పని వాళ్ళను డ్రగ్స్ కోసం వాడుకున్నాడని ఆరోపణ

    తనను , తన సోదరుడ్ని , ఇంట్లో పని వాళ్ళను డ్రగ్స్ కోసం వాడుకున్నాడని ఆరోపణ

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియాను, ఆమె సోదరుడు షోయిక్ ను, సుశాంత్ తన ఇంటి సిబ్బందిని తన డ్రగ్స్ అలవాటుకు ఉపయోగించుకున్నాడని పేర్కొంది . సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన మరణానికి మూడు రోజుల ముందు తన కుక్ నీరజ్‌ను డ్రగ్స్ తెచ్చి తన బెడ్ రూమ్ లో పెట్టాలని చెప్పినట్టు రియా పేర్కొంది. నీరజ్ సిబిఐ, ముంబై పోలీసులకు తాను సుశాంత్ చెప్పినట్టే చేశానని ,ఆ తర్వాత సుశాంత్ మరణం తర్వాత ఆ మాదక ద్రవ్యాలను సుశాంత్ వినియోగించినట్టు గుర్తించానని చెప్పినట్టు సమాచారం .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+