తేదీ ఖరారుపై: టిపై షిండే, అన్యాయం నిజమే: సుష్మా
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ ఖరారు పైన తాము దృష్టి సారించామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం చెప్పారు. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉదయం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించి తమకు గవర్నర్ నుండి ఎలాంటి నివేదిక అందలేదని చెప్పారు.
పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇక తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ ఖరారుపై దృష్టి సారించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలా లేక కొత్త ప్రభుత్వమా అనే విషయమై ఆలోచిస్తున్నామని షిండే చెప్పారు.

సీమాంధ్రకు అన్యాయం వాస్తవం: సుష్మా
సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ శుక్రవారం అన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణకు మద్దతు తెలిపి మాట నిలబెట్టుకున్నామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తుందన్నారు.
రాజధానిపై జెపి
రాజధాని ఉన్న ప్రాంతం విడిపోవడం ఇదే ప్రథమమని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రెండు ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు రావాలని అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై తమ పార్టీ లోతైన వ్యూహాన్ని అనుసరించిందని చెప్పారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications