స్మృతి తర్వాత అనుప్రియ: మోడీ చెక్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ మహిళా నేతలను పరీక్షిస్తున్నారా? వరుస ఎన్నికల నేపథ్యంలో తొలుత సుష్మా స్వరాజ్, తర్వాత స్మృతి ఇరానీ, ఇప్పుడు అనుప్రియా పటేల్.. ఇలా ప్రతిసారి ఓ మహిళకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
తద్వారా, రాజకీయాల్లో మహిళలను ఆకట్టుకునేందుకు, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు ఓ మహిళ స్థానంలో మరో మహిళను చెక్ చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
2014 ఎన్నికల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ స్మృతి ఇరానీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె అమేథీ నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో రాహుల్‌కు చుక్కలు చూపించారు.
అమేథీలో జరిగిన ర్యాలీలో మోడీ.. స్మృతి ఇరానీని ఉద్దేశించి సోదరి అని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం స్మృతికి హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను అప్పగించారు. కొద్ది రోజుల క్రితం వేముల రోహిత్ ఆత్మహత్య వివాదం చెలరేగినప్పుడు.. పార్లమెంటులో స్మృతి చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ ముగ్ధులయ్యారు. ఆమె ప్రసంగంపై సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు.

సుష్మా స్వరాజ్‌కు కౌంటర్‌గా స్మతిని తెరపైకి తీసుకు వచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. బీజేపీలో సుష్మా స్వరాజ్ కీలక నేత. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీని మోడీ నేతృత్వంలోని సుష్మా స్వరాజ్ అని కూడా అంటారని చెబుతున్నారు. తద్వారా మోడీ, అమిత్ షా.. స్మృతికి ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో తెలుస్తోంది.
ఇప్పుడు అనూహ్యంగా అనుప్రియా పటేల్‌ను మోడీ తెరపైకి తీసుకు వచ్చారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ, కుర్మి, దళిత నేతలను ఒక్కొక్కర్ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇందులో అనుప్రియా పటేల్ కుర్మి వర్గానికి చెందినవారు.
యూపీలో బీజేపీ ఫేస్‌గా వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ తదితరుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా అనుప్రియా పటేల్ తెరపైకి వచ్చారు. స్మృతి ఇరానీని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి, ఆమెకు జౌళీశాఖకు మార్చారు. ప్రాధాన్యత శాఖ నుంచి ఆమెను అప్రధాన్యత శాఖకు మార్చారని అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications