కౌంటింగ్ కు ముందు ఈసీకి సువేందు కీలక ప్రతిపాదన

ఇంకొక్క రోజే మిగిలివుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలో ే పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నాయి.

కాగా ఈ పరిస్థితుల మధ్య పశ్చిమ బెంగాల్ లో రీపోలింగ్ కొనసాగుతోంది. 24 పరగణా జిల్లా మార్ఘాట్ పశ్చిమ్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15 కేంద్రాల్లో రీపోలింగ్ ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు ఆరంభమైంది. ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు గట్టిపట్టు ఉన్న జిల్లా ఇది. ఏప్రిల్ 29న జరిగిన రెండో విడత ఓటింగ్ సందర్భంగా ఇక్కడ అల్లర్లు చోటు చేసుకున్నాయనే కారణంతో రీపోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్.

Suvendu Adhikari Welcomes Marghat Paschim Repolling and Demands Same Across the Falta Segment

దీన్ని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్వాగతించారు. మార్ఘాట్ పశ్చిమ్ పాటు ఫల్తా, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని బూత్ లల్లో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్ చేశారు. డైమండ్ హార్బర్, ఫల్తా నియోజకవర్గాల్లో మొత్తం 60 పోలింగ్ కేంద్రాలలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఫల్తాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఎన్నికల గుర్తు ఉండే బటన్ పై టేప్‌ అంటించారని, ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆయన విమర్శించారు.

ఫల్తా నియోజకవర్గానికి సంబంధించి అబ్జర్వర్ నుంచి వచ్చిన నివేదికలు, ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్‌బుక్, సీసీటీవీ ఫుటేజ్ వంటి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని సువేందు అధికారి పేర్కొన్నారు. రాష్ట్ర అధికారులను కౌంటింగ్ పర్యవేక్షకులుగా నియమించకుండా అడ్డుకున్న ఎన్నికల సంఘం ఉత్తర్వులను టీఎంసీ సుప్రీంకోర్టులో సవాలు చేయడాన్ని సువేందు తప్పుబట్టారు. మమతా బెనర్జీ గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ రీపోలింగ్ ను బీజేపీ ఖరగ్‌పూర్ అభ్యర్థి దిలీప్ ఘోష్ కూడా స్వాగతించారు. స్ట్రాంగ్ రూమ్‌లలో బీజేపీ ఓట్ల ట్యాంపరింగ్ చేస్తోందంటూ మమత బెనర్జీ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అధికారాన్ని కోల్పోతోన్నామనే నిరాశతోనే మమత బెనర్జీ ఇటువంటి ఆరోపణలు చేస్తోన్నారని ఎదురుదాడికి దిగారు. ఫుట్‌పాత్‌లపై తిరగడం, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలంటూ పార్టీ కార్యకర్తలను ప్రేరేపించడం చూస్తోంటే ఆమె ఓడిపోబోతోందని స్పష్టంగా తెలుస్తోందని ఘోష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+