బాత్ రూమ్ లో ఉన్న స్వామీజీని ఎత్తుకెళ్లి ఏం చేశారంటే ?, మరో స్వామీజీ స్కెచ్

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు ((కర్ణాటక)లోని ఆనందమార్గ్‌ ఆశ్రమం భూవివాదం నేపథ్యంలో ఇద్దరు స్వామీజీల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో ఒక సీనియర్ స్వామీజీపై మరో స్వామీజీ దారుణంగా దాడి చేసి హత్య చెయ్యడం కలకలం రేపింది. ఆశ్రమం ఆస్తుల విషయంలో కర్ణాటకలో మరో స్వామీజీ దారుణ హత్యకు గురికావడంతో సాటి స్వామీజీలు ఉలిక్కిపడ్డారు.

కోలార్‌లోని ఆనంద మార్గ్ ఆశ్రమం భూ వివాదంపై రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో దాడికి గురైన ఓ స్వామీజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కోలారు జిల్లా మలూరు తాలూకా సంతల్లి గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తిని ఆచార్య చిన్మయానంద అవదూర్ స్వామీజీ (65)గా గుర్తించారు. ఆచార్య ధర్మ ప్రాణానంద స్వామీజీని ఆయన బృందం హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Swamiji was brutally murdered for the ashram s property in Kolaru district in Karnataka

ఈ ఘటన మాలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


మలూరు తాలూకా సంతల్లి గ్రామంలోని నాలుగు ఎకరాల ఆశ్రమ భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. ఈ ఉదయం భూముల పత్రాలతో కోర్టుకు వెళ్తుండగా స్వామీజీపై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన చిన్మయానందను కోలార్‌లోని ఆర్‌ఎల్‌ జలప్ప ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వామి మృతి చెందాడు.

ఆచార్య ధర్మ ప్రాణానంద, అరుణ్‌లను మాలూరు పోలీసులు అరెస్టు చేశారు.
నా దినచర్య ముగించుకోవడానికి వాష్‌రూమ్‌కి వెళ్లాను. తర్వాత అక్కడికి వచ్చి తలుపులు పగులగొట్టి నన్ను ఈడ్చుకెళ్లి పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని దారుణంగా దాడి చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు తనపై మానసికంగా దాడి చేశారని, వాళ్ల చేతుల్లోని పెద్ద కర్రలు నలిగిపోయాయని, నా శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయాయని స్వామీజీ పోలీసులకు చెప్పాడు.

నా కన్ను పూర్తిగా దెబ్బతిందని, ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందని, నేను బతుకుతానన్న నమ్మకం లేదని, తనపై ముందు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చనిపోయే ముందు స్వామీజీ పోలీసులను అభ్యర్థించాడు. కేసు నమోదు చేసిన కోలారు జిల్లా పోలీసు అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్వామీజీ హత్యకు గురి కావడంతో కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+