ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం: టేకాఫ్ సమయంలో విమానంలో

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం సంభవించింది. ఓ విమానం టేకాఫ్ కు సిద్ధమైన దశలో ఇంజిన్ లో వైఫల్యం చోటు చేసుకుంది. ఆ వెంటనే మంటలు వ్యాప్తించాయి. ఈ ఘటనలో ఆరుమంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శకటాలు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

స్విస్ పౌరవిమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్ అది. దాని నంబర్ ఎల్ ఎక్స్ 147. ఎయిర్ బస్ 330కి రకానికి చెందినది. ఈ వేకువ జామున ఒంటిగంటకు న్యూఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఇంజిన్ విఫలమైంది. ఫలితంగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ కోసం రన్ వేపైకి బయలుదేరిన సమయంలో అవాంఛనీయ సౌండ్ వినిపించింది. ఆ వెంటనే రెండు ఇంజిన్లల్లో ఒకటి విఫలమైంది.

Swiss Flight LX147 Abort Takeoff After Engine Fire in Delhi Airport 6 Injured Passengers Evacuated

దీంతో టేకాఫ్‌ను నిలిపివేశారు. సడన్ గా విమానాన్ని నిలిపివేయడంతో భారీగా కుదుపులకు లోనైందది. ఆరుమంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఈ వేకువ జామున 1:08 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 228 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

మంటలు వ్యాప్తిచెందిన వెంటనే అత్యవసర స్లైడ్‌ల ద్వారా ప్రయాణికులకు రన్‌వేపైకి తరలించారు. స్లైడ్లు ఉపయోగించని వారికి మెట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్ లైన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాద విషయాన్ని నిర్ధారించింది. ముందుజాగ్రత్తగా విమానాన్ని ఖాళీ చేయించామని, వారిలో ఆరుమంది గాయపడ్డారని తెలిపింది. వారికి మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొంది. సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+