అన్నపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేమ.. బంగారు నాణేలతో అభిషేకించిన తలైవా!!

తలైవా రజనీకాంత్‌కు తన అన్నపై చాలా ప్రేమ ఉందని తెలుస్తుంది. తాజాగా ఆయన తన సోదరుడి పుట్టినరోజున బంగారు నాణేలతో అభిషేకం చెయ్యటం ఆసక్తిగా మారింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలలో ఎంతో బిజీగా ఉండే వ్యక్తి. తలైవాగా ప్రజలందరి మనసుల్లో నిలిచిపోయిన సూపర్ స్టార్ ఏం చేసినా సంచలనమే . సినిమాలకు ఆయన ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అలాగే ఆయన తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఒంట పట్టించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల తన అన్నయ్య పైన తనకున్న ప్రేమను కనకవర్షం కురిపించి మరీ వ్యక్తం చేశారు.

అన్న పుట్టినరోజున ఆయనపై కనకవర్షం కురిపించిన రజినీకాంత్

ఇటీవల ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, అలాగే ఫిబ్రవరి 19వ తేదీన తన అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బెంగళూరుకు వెళ్లిన రజినీకాంత్ తన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ 80వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనను ఈరోజు ఇంత ఉన్నతంగా మార్చిన బంగారు హృదయానికి కనక వర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశానని పేర్కొన్న రజినీకాంత్ తన సోదరుడికి బంగారు నాణేలతో అభిషేకం చేశారు.

 సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రజినీకాంత్ భావోద్వేగం

సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రజినీకాంత్ భావోద్వేగం


ఇక సోషల్ మీడియా వేదికగా ఉద్వేగానికి లోనయ్యారు. ఫిబ్రవరి 19 తన అన్నయ్య పుట్టినరోజు తో పాటుగా, తన అన్నయ్య కుమారుడు రామకృష్ణ 60వ పుట్టినరోజు కూడా కావడంతో ఈరోజు డబల్ వేడుక అంటూ పోస్ట్ చేసినా రజినీకాంత్ ఉద్వేగానికి లోనయ్యారు. రజనీకాంత్ మరియు లత కుటుంబ సభ్యులతో బెంగళూరులో సంతోషంగా గడిపారు. ఇక ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసిన రజినీకాంత్ తన అన్నయ్యతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని స్పష్టం చేశారు.

 అన్నపై రజనీకాంత్ కు ఉండే ప్రేమ సోదరబంధానికి ప్రతీక

అన్నపై రజనీకాంత్ కు ఉండే ప్రేమ సోదరబంధానికి ప్రతీక

రజనీకాంత్ కు తన అన్నయ్య అంటే ఎనలేని అభిమానం. ఆయనతో సన్నిహితంగా మెలగడంతోపాటు, జీవితంలో తీసుకునే అనేక ప్రధాన నిర్ణయాలపై ఎప్పుడు ఆయనను సంప్రదించి, ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రజనీకాంత్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బంగారు నాణేలతో అభిషేకించడం సోదరుల మధ్య ప్రేమ బంధానికి అద్దం పడుతుంది. అన్నా దమ్ములు అంటే ప్రేమగా, ఇలా ఉండాలని చెప్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+