శశికళకు ఝలక్: డీఎంకేతో చేతులు కలిపిన సీనియర్ నటుడు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బహుబాషా నటుడు, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు రాధా రవి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
మంగళవారం చెన్నైలోని అన్నా ఆరివాలయంలో స్టాలిన్ సమక్షంలో రాధా రవి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. జయలలిత మీద ఉన్న అభిమానంతో రాధా రవి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. తమిళనాడులోని పలు జిల్లాలో రాధా రవి అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి ప్రచారం చేశారు.

జయలలిత మరణించిన తరువాత శశికళ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన ప్రసంగాలతో ఎంతో ఆకట్టుకునే రాధా రవి చివరికి అన్నాడీఎంకే పార్టీకి టాటా చెప్పేసి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.
తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో రాధా రవి నటించారు. ప్రతినాయకుడిగా ఆయన ఎన్నోసినిమాల్లో నటించారు. రాధా రవికి తమిళ సినీరంగంలో ఓప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కామిడీ చెయ్యడంలో కూడా ఆయన దిట్ట. ఇప్పుడు శశికళకు ఝలక్ ఇచ్చిన రాధా రవి ఇక ముందు ఆమె మీద ఎన్ని ఆరోపణలు చేస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications