Tamil Nadu Opinion Poll: తమిళ ఓటర్ల మొగ్గు ఎటు ? తాజా సర్వేలో క్లీన్ స్వీప్..!
తమిళనాడు (Tamil Nadu)లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ సర్వేలు పూర్తి చేసి ఫలితాలు కూడా ప్రకటించాయి. ఇవాళ తమిళనాట ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ మరికొన్ని సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ జేవీసీ పోల్ తమ తుది సర్వే ఫలితాలను ప్రకటించింది.
జేవీసీ పోల్ (JVC poll) తుది సర్వే అంచనాల ప్రకారం ఓటర్లు ఈసారి విపక్ష అన్నాడీఎంకే (AIADMK) కూటమివైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీయే కూటమిని నడుపుతున్న అన్నాడీఎంకే ఈసారి ఎన్నికల్లో ఏకంగా 140-159 సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని జేవీసీ పోల్ సర్వేలో తేలింది. తమిళనాడు అసెంబ్లీలో అధికారం కావాలంటే మ్యాజిక్ మార్కు మెజార్టీ 118 సీట్లే. దీంతో అన్నాడీఎంకే కూటమికి అధికారం ఖాయమైనట్లు సర్వే చెబుతోంది.

Tamil Nadu Opinion Poll#JVCPoll pic.twitter.com/h2uFDiAdGq
— JVC Sreeram (Bulls Eye) (@sreeramjvc) April 21, 2026
మరోవైపు అధికార డీఎంకే కూటమి (DMK) ఈసారి ఎన్నికల్లో చతికల పడటం ఖాయమని జేవీసీ పోల్ అంచనా వేసింది. ఈసారి డీఎంకే కూటమికి కేవం 70-92 సీట్లు మాత్రమే లభిస్తున్నట్లు జేవీసీ పోల్ తెలిపింది. అలాగే విజయ్ కొత్త పార్టీ టీవీకే అయితే 2-5 సీట్లతో సరిపెట్టుకోక తప్పదని సర్వే తేల్చేసింది. ఓట్ల శాతాలకు వస్తే అన్నాడీఎంకే కూటమి వైపు 38.8 శాతం నుంచి 40.2 శాతం ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. డీఎెంకే కూటమివైపు 35.1 నుంచి 36.4 శాతం ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. విజయ్ టీవీకే వైపు 17.7 నుంచి 20.2 శాతం ఓటర్లు మొగ్గుచూపుతున్నారు.












Click it and Unblock the Notifications