Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీకి ఈ నెల 23న జరగబోయే ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకున్న వేళ ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఏబీపీ ఛానల్ తమిళనాడులో ఓటర్ల నాడిపై నిర్వహించిన తాజా సర్వే ఫలితాలను ఇవాళ వెల్లడించింది. ఇందులో ఆశ్చర్యకరంగా తమిళనాడులో హోరాహోరీ పోరేమీ లేదని తేలిపోయింది. ఏకపక్షంగానే ఎన్నికలు జరగబోతున్నాయని సర్వేలో తేలింది.
తమిళనాడులో ఏబీపీ నిర్వహించిన తాజా సర్వేలో అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తుందని తేలింది. రాష్ట్రంలోని 234 సీట్లలో డీఎంకే కూటమి 172 నుంచి 179 సీట్లు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని వెల్లడైంది. అలాగే విపక్ష అన్నాడీఎంకే కూటమి కేవలం 50-58 సీట్లు మాత్రమే గెల్చుకుందని తేలింది. చివరిగా విజయ్ పార్టీ టీవీకే కు కేవలం 4-6 సీట్లు లభించే అవకాశం ఉందని సర్వేలో తెలిపారు.

2019 లోక్‌సభ ఎన్నికల నుంచి డీఎంకే సాధిస్తున్న నిలకడైన ఎన్నికల విజయాలకు నిదర్శనంగా ఈ ఫలితాలు ఉన్నాయి. ఆ పార్టీ యొక్క బలమైన సంక్షేమ పథకాలు, కూటమి నిర్మాణం ఇప్పటికీ దానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని సర్వే తెలిపింది.
దీని ముందు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నిలవడం కష్టమని ఏబీపీ సర్వేలో తేలింది. అలాగే కొత్త పార్టీ టీవీకే పట్ల కూడా ఓటర్ల మొగ్గు కనిపించడం లేదని ఏబీపీ సర్వే స్పష్టం చేసింది. దీంతో విజయ్ కు తొలి ఎన్నికల్లోనే నిరాశ తప్పేలా లేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వెలువడిన ఈ సర్వే రాష్ట్రంలో డీఎంకే కూటమి హవాను మరోసారి వెల్లడించింది.












Click it and Unblock the Notifications