అసెంబ్లీ స్పీకర్ కారుకు ప్రమాదం -ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -మోదీ సభకు వెళ్తుండగా ఘటన
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, మంత్రి ఎస్పీ వేలుమణి కాన్వాయ్ లు ప్రమాదానికి గురయ్యాయి. ధారాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొనేందుకు బయలుదేరిన ఇద్దరు నేతల కాన్వాయ్ లు ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం సభవించింది. అతివేగంగా రెండు కార్లు గుద్దుకోవడంతో వాటిని వేరు చేసేందుకు క్రేన్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది.
అన్నాడీఎంకే నేత, అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ కాన్వాయ్ ధారాపురంలోని సూరియనల్లూర్ టోల్ గేట్ వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుంచి మంత్రి వేలుమణి కాన్వాయ్ వేగంగా దూసుకొచ్చి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పీకర్ కాన్వాయ్ లోని ఇన్నోవా వాహనం, మంత్రి కాన్వాయ్ లోని మరో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ప్రమాదంలో స్పీకర్ కుగానీ, మంత్రికిగానీ ఎలాంటి గాయాలు కాలేదని, వాహనాలను నడిపిన డ్రైవర్లు ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. తొలుత స్పీకర్ ధన్ పాల్ గాయపడ్డారని మీడియాలో వార్తలు రాగా, వాటిని పోలీసులు ఖండించారు. ప్రమాదం తర్వాత స్పీకర్, మంత్రి నేరుగా ధారాపురం వెళ్లి ప్రధాని మోదీ సభలో పాల్గొన్నారు.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల 6న పోలింగ్ జరుగనుంది. అధికార అన్నాడీఎంకే.. బీజేపీతో కలిసి పోటీ చేస్తుండగా, ప్రతిపక్ష డీఎంకే.. కాంగ్రెస్, లెఫ్ట్, వీకేసీ తదితర పార్టీలతో కూటమిగా పోరాడుతున్నది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications