నెట్ నుంచి ఉరి చిట్కాలు పొంది యువకుడి ఆత్మహత్య

కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన జరిగింది. ఓ 21 ఏళ్ల యువకుడు తాడుతో ఎలా ఉరేసుకోవాలనే విషయంపై ఇంటర్నెట్‌లో చిట్కాలు పొంది ఉరేసుకుని మరణించాడు. ఉరేసుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేశాడు. ఉరేసుకోవడానికి ముందు ఉరి ఫొటోలను మిత్రులకు వాట్సప్‌లో పంపిణీ చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో మంగళవారంనాడు చోటు చేసుకుంది.

సాయిబాబా కాలనీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ బాజ్‌పేయి కుమారుడైన 21 ఏళ్ల వి. నిఖిలేష్ వాజ్‌పేయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిఖిలేష్ వాజ్‌పేయి కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. నగరం కౌలీ బ్రౌన్ రోడ్డులోని ఫారెస్ట్ జెనెటిక్స్, ట్రీ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్ క్వార్టర్స్‌లో వారు నివాసం ఉంటున్నారు.

Tamil Nadu: Boy gets suicide tips on net, ends life

పీలమేడులోని అవినాషి రోడ్డులో గల ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో అతను బిఎస్పీ ఫిజిక్స్ తుది సంవత్సరం చదువుతున్నాడు. ఐఎఫ్‌జిటీబీలో అతని తండ్రి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి నిఖిలేష్ తన తల్లిదండ్రులతో మాట్లాడి పదకొండున్నర గంటల ప్రాంతంలో తన గదిలోకి వెళ్లాడు.

మర్నాడు ఉదయం విజయకుమార్ కుమారుడి గది తలుపు తట్టాడు. లోపలి నుంచి ఏ విధమైన ప్రతిస్పందన కూడా రాలేదు. ఏదో జరిగిందనే భయపడుతూ విజయకుమార్ పొరుగువారిని పిలిచి గది తలుపు పగులగొట్టాడు. వారు చూసేసరికి నిఖిలేష్ ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. నిఖిలేష్ ఉరికి సంబంధించిన చిత్రాలను తీసుకున్నాడు. వాటిని మిత్రులకు పంపించాడు. ఆ తర్వాత తన మొబైల్ నుంచి వాటిని తొలగించాడు. తాము అతని మొబైల్ ఫోన్‌ను, మెమొరీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య వెనుక ఏ విధమైన కుట్ర లేదని వారు చెప్పారు. నిఖిలేష్ గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. తీవ్రమైన మానిసిక ఒత్తిడితో చదువు కొనసాగించలేనని ఆ నోట్‌లో అతను రాశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+