సీఎం స్టాలిన్ మంచి మనసు: కాన్వాయ్ ఆపి, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలింపు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై నుంచి పడటంతో అతనికి గాయాలయ్యాయి.
క్రోమ్‌పేట్‌కు చెందిన అరుల్‌రాజ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. అదుపుతప్పి డీఎంఎస్ సమీపంలో పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి.

అదే సమయంలో సచివాలయం వెళుతున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రోడ్డుపై పడివున్న అతడ్ని గమనించి.. కాన్వాయ్ ఆపారు. కిందికి దిగి అతడ్ని ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. దీంతో వారు అతడ్ని ఆటోలో ఎక్కించి రోయపెట్టా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంకు గురైన బాధితుడిని ఆటోలో ఎక్కి హాస్పిటల్కు పంపించిన తమిళనాడు సీఎం @mkstalin #CMStalin #mkstalin #oneindiatelugu pic.twitter.com/Ex18y3pSRf
— oneindiatelugu (@oneindiatelugu) October 22, 2022
సదరు బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ ఎజిలన్‌కు సూచించారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సీఎం స్టాలిన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా ఇలానే పలువురికి సాయం చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications