మతోన్మాదుల గుప్పిట్లో దేశం.. కాపాడుకుందాం రండి : 37 మంది నేతలకు స్టాలిన్ లేఖ
దేశంలో రాజకీయ పరిణామాలు మారుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రాంతీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. మోదీ పాలనతో దేశం ప్రమాదంలో పడిందని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేస్తేనే బీజేపీని అధికారంలో నుంచి దించగలమని ఆమె పేర్కొన్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోదీ ప్రభుత్వంపై తాడో పెడో తేల్చుకుంటామంటూ హెచ్చరించారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు త్వరలో అన్ని పార్టీలను కలుస్తున్నానని చెప్పారు.

మత్మోన్మాదుల గుప్పిట్లో దేశం..
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మత్మోన్మాదులు గుప్పిట్లోకి వెళ్లి దేశ ప్రమాదంలో పడిందన్నారు. ఈ మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలన్నారు. ఇందులో భాగంగా దేశంలోని 37 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు తమళనాడు సీఎం లేఖ రాశారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన "ఆల్ ఇండియా సోషల్ జస్టిస్" వేదికను స్టాలిన్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు.

సోనియా, మమతా, చంద్రబాబు, కేసీఆర్‌లకు స్టాలిన్ లేఖ
తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసినవారిలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్ , శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ఫారూఖ్ అబ్దుల్లా, డీ.రాజా, సీతారం ఏచూరి, మెహబూబా ముఫ్తీలతో పాటు మరికొందరికి ఈ లేఖను పంపారు . మరోవైపు తమిళనాడులోని పార్టీల నేతలకు కూడా పంపారు. ఏఐడీఎంకే కోర్డినేటర్ పన్నీర్‌సెల్వం, పీఎంకే అధినేత రాందాస్, వీసీకే నేత థోల్ తిరుమవలన్‌లతో పాటు వైకోకి కూడా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖలను పంపారు.
Recommended Video

సమ సమాజాన్ని నిర్మిద్దాం..
సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి రావాలని తాను ఆకాంక్షిస్తున్నాట్లు సీఎం స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్యలు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సమానమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులకు అర్హులన్న భావం జాలాన్ని నమ్ముతామన్నారు. ఈ సమాన అవకాశాలను అందరికి అందించిన నాడే రాజ్యాంగం ప్రకారం సమానత్వ సమాజాన్ని నిర్మించగలమని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కలిసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications