ఆట మొదలైంది: పన్నీర్ కు 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు !

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే విషయంలో నిన్నటి వరకు స్పష్టటత లేకపోయినా గురువారం ఉదయం ఈ ఉత్కంఠకు తెరదించుతూ అన్నాడీఎంకేకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు .

చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ గురువారం చెన్నై చేరుకుంటున్న సమయంలో వెనువెంటనే శరవేగంగా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే విషయంలో నిన్నటి వరకు స్పష్టటత లేదు.

అయితే ఈ గురువారం ఉదయం ఈ ఉత్కంఠకు తెరదించుతూ అన్నాడీఎంకేకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారని తెలిసింది. అన్నాడీఎంకేలోని మరింతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం.

Tamil Nadu CM Panneerselvam supporters 22 AIADMK MLA’s ?

పన్నీర్ సెల్వంకు 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని వెలుగు చూడటంతో శశికళ వర్గంలో అప్పుడే కలవరపాటు మొదలైయ్యింది. మా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. తానను సీఎం కాకుండా అడ్డుకోవడం ఎవ్వరికీ సాధ్యంకాదని శశికళ ధీమాగా ఉన్నారు.

గురువారం అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ తమ తమ వర్గాలతో గవర్నర్ విద్యాసాగర్ రావును కలవనునన్నారు. పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన తరువాత తమిళనాడు సీఎం ఎవరు ? అనే విషయం కచ్చితంగా తేలిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+