విజయ్ ఊహించని నిర్ణయం, సొంత మంత్రులకే షాక్..!!
తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. పాలనా పరంగానూ విజయ్ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఎక్కడా మిత్రపక్షాలతో సహా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక.. ఇప్పుడు విజయ్ తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారింది.
సీఎం విజయ్ తాజా నిర్ణయాలు కేబినెట్ సహా సొంత పార్టీలోనూ చర్చగా మారుతున్నాయి. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ తన వద్దే కీలక శాఖలు ఉంచుకున్నారు. మిగిలిన తొమ్మది మంది మంత్రులకు శాఖలు ఖరారు చేసారు. సుదీర్ఘ కసరత్తు తరువాత నేతల సీనియార్టీ.. వారి అర్హతలు .. విధేయత ఆధారంగా పోర్టు పోలియోలు కేటాయించారు. తన కేబినెట్ లో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న కీర్తనకు కీలకమైన పరిశ్రమలు.. పెట్టుబడుల శాఖ కేటాయించారు. ఆర్దిక శాఖ ను సీనియర్ సెంగొట్టియన్ కు అప్పగించారు. కాగా.. తాను ప్రమాణ స్వీకారం లో చెప్పిన విధంగా శాంతి భద్రతలు.. మహిళా రక్షణ - సంక్షేమ బాధ్యతలను తానే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. అందులో భాగంగా శిశు సంక్షేమం తానే చూడనున్నారు. హోం శాఖ తన వద్దే ఉంచుకోవటం ద్వారా సినిమాటోగ్రఫీ సైతం విజయ్ పర్యవేక్షణలోనే కొనసాగనుంది.

ఇక, విజయ్ ప్రాధాన్యత ఇస్తున్న విద్య.. తమిళ వ్యవహారాలను రాజ్ మోహన్ కు అప్పగించారు. తన సన్నిహిత నేత ఆదవ్ అర్జున కు స్పోర్ట్స్... రవాణా శాఖ కేటాయించారు. పంచాయితీ రాజ్ ను ఆనంద్ కు అప్పగించారు. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ రెవిన్యూ తో పాటుగా పథకాల అమలు కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ పర్యవేక్షణ బాధ్యతలను తానే స్వీకరించారు. చెన్నై సిటీ నిర్వహణా బాధ్యతలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాలతో సొంత మంత్రులే షాక్ అవుతున్నారు. పాలనా పరంగా ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని విజయ్ భావిస్తున్నారు. అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతు తో విజయ్ కు ప్రస్తుతానికి సంఖ్యా పరంగా మెజార్టీకి ఇబ్బంది లేదు. అయితే, మిత్ర పక్షాల నుంచి ఇబ్బందులు లేకుండా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ దిశగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు విజయ్ కేబినెట్ లో మంత్రు లు కానున్నారు. అదే విధంగా అన్నా డీఎంకే చీలిక వర్గం నేతలతో విజయ్ సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications