బైక్ కొంటే మేక ఫ్రీ అన్నాడు.. అంతే, ఎగబడిపోయారు, ఎక్కడంటే...

తమిళనాడులోని ఇలియంగుడీ అనే ఓ చిన్న పట్టణంలో గాయత్రీ మోటర్స్‌ డీలర్.. కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని, ‘‘మా వద్ద బైక్ కొంటే మేక ఫ్రీగా ఇస్తాం’’ అని ప్రకటించేశాడు. అంతే, రెస్పాన్స్ చూసి మతిపోయింది అతడికి.

చెన్నై: పండుగలు, పర్వదినాల్లో ఆఫర్లు ప్రకటించడం వ్యాపార వర్గాలకు సర్వసాధారణమే. ఇక 'ఉచితం' అంటూ ఎవరైనా ప్రకటించాలేగానీ.. జనం ఎగబడకుండా ఉంటారా? ఇక్కడా అదే జరిగింది.

దసరా, దీపావళి పండుగల్లో మోటారు వాహనాలకు మంచి డిమాండు ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యాపారులు రకరకాల రాయితీలు, బహుమతులు ప్రకటిస్తారనే సంగతి తెలిసిందే.

Tamil Nadu dealer offers FREE GOAT on every BIKE; cancels later due to heavy demand

అలాగే తమిళనాడులోని ఇలియంగుడీ అనే ఓ చిన్న పట్టణంలో గాయత్రీ మోటర్స్‌ డీలర్.. కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని, ''మా వద్ద బైక్ కొంటే మేక ఫ్రీగా ఇస్తాం'' అని ప్రకటించేశాడు.

అంతేకాదు, ఈ ఆఫర్ కొత్తగా బైకు కొనేవారికే కాకుండా వాహనాన్ని ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవారికి కూడా వర్తిస్తుందని తెలిపాడు. ఇంకేముంది, ఈ ప్రకటనకు విశేష స్పందన లభించింది. ఎంతగా అంటే.. ఇక ఫ్రీగా ఇవ్వడానికి మేకలు కూడా సరిపోనంత.

రోజూ బైకులు కొనేవాళ్లు 'మేక ఇస్తానే కొంటాం.. లేకపోతే వేరే చోటకు వెళ్తాం' అంటూ.. డీలర్ ను ఇబ్బంది కూడా పెట్టారు. ఈ ఆఫర్ కి డిమాండ్ బాగా పెరగడంతో చివరికి ఆ డీలర్ తన ప్రకటనను రద్దు చేసేశాడు.

ఈ ఆఫర్‌ను మధ్యలోనే ఆపేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఫ్రీగా ఇచ్చేందుకు మేకలు అందుబాటులో ఉన్నా ఒక్కో మేక ధర దాదాపు రూ.3 వేలకు పెరగడంతో.. వాటిని కొనలేక డీలర్ చేతులెత్తేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+