వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు ఎలక్షన్ ఫైట్ : కోయంబత్తూర్ సౌత్ నుండి ఎన్నికల బరిలోకి కమల్ హాసన్

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించిన కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికలకు మూడో కూటమిని ఏర్పాటు చేసి, కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేయనున్నారు.

దీదీపై దాడితో ఢిల్లీకి చేరిన పంచాయితీ .. టీఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల వాయిదాదీదీపై దాడితో ఢిల్లీకి చేరిన పంచాయితీ .. టీఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల వాయిదా

 థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన కమల్ హాసన్ .. కోయంబత్తూరు సౌత్ నుండి పోటీ

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన కమల్ హాసన్ .. కోయంబత్తూరు సౌత్ నుండి పోటీ

ఎన్నికలపై సంయుక్తంగా పోరాడటానికి నటుడు-రాజకీయ నాయకుడు శరత్‌కుమార్ యొక్క ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి, భారత జననాయగ కట్చిలతో మక్కల్ నీది మయ్యం ఒప్పందం కుదుర్చుకుంది. మూడో కూటమి ఏర్పాటు చేసి సీఎం అభ్యర్థిగా కమల్ హాసన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపధ్యంలో

నిన్న అర్థరాత్రి వరకు వచ్చిన అవగాహన ప్రకారం, ఆల్ ఇండియా సమతవ మఖల్ కచ్చి, భారత జనానయక కచ్చి ఒక్కొక్కటి 40 సీట్ల నుండి పోటీ చెయ్యనున్నాయి . మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నారు .

కమల్ హాసన్ పార్టీ 154 స్థానాలలో బరిలోకి

కమల్ హాసన్ పార్టీ 154 స్థానాలలో బరిలోకి

మార్పు కోసం వాగ్దానం చేసిన కూటమి ఎన్నికలలో విజయవంతం కావడం ప్రాథమిక లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగింది ప్రజల దీర్ఘకాల ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా తమిళనాడును మార్చాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకున్న పార్టీలు దాని కోసం కట్టుబడి ఉన్నాయని ఈ ఒప్పందం ద్వారా తెలిపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను 154 స్థానాలలో మక్కల్ నీది మయ్యం పోటీ పడనుంది. మూడవ కూటమి నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్ హాసన్ అని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అధినేత శరత్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు.

 2018లోనే మక్కల్ నీది మయ్యంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన కమల్ హాసన్

2018లోనే మక్కల్ నీది మయ్యంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన కమల్ హాసన్

2018 లో, నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యంను ప్రారంభించారు, ఒక "సెంట్రిస్ట్" లైన్ అని చెప్పుకున్న ఆయన పార్టీ 2019 లోక్సభ ఎన్నికలలో 3.77 శాతం ఓట్లు సాధించింది . 4,18,25,669 ఓట్లలో 15,75,640 ఓట్లను పొందింది .

మరోవైపు తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ద్రావిడ మున్నేట కజగం (డిఎంకె) తన మొదటి అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కోలాథూర్ నుండి మళ్లీ పోటీ చేస్తుండగా, అతని కుమారుడు ఉదయ్ నిధి చేపాక్ నియోజకవర్గం నుండి అడుగుపెట్టనున్నారు.

English summary
Makkal Needhi Maiam (MNM) chief Kamal Haasan will contest from Coimbatore South in the upcoming Tamil Nadu Assembly elections.MNM inked an agreement with actor-politician Sarathkumar''s All India Samathuva Makhal Katchi and Indiya Jananayaka Katchi to jointly fight the polls.According to the understanding reached here late last night, AISMK and IJK would contest from 40 seats each.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X