వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగడంలో తమిళులే తోపులు, రికార్డు.. తెలుగు మందుబాబుల వెనుకబాటు.. ఇవిగో లెక్కలు..

|
Google Oneindia TeluguNews

సీరియస్ అంశాల నుంచి సిల్లీ థింగ్స్ దాకా ప్రతిదాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తేవడం తమిళ తంబీకు బాగా అలవాటైనపని. మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాలతో పోటీకి నిత్యం కాలుదువ్వే తంబీలు మరో ఘనతనూ బజాయించుకుంటున్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో సౌతిండియాలోనే టాప్ లో ఉన్న తమిళనాడు.. అనూహ్యంగా మద్యం అమ్మకాల్లోనూ దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలు రెండిటినీ కలిపినా రానంత రేంజ్‌లో తమిళ మందుబాబులు తడాఖా చూపించారు.

Liquor Sales in Hyderabad: మందుబాబుల దండయాత్ర...దసరాను మించిన దమాకా...లిక్కర్ సేల్స్ ఎంతంటే..!Liquor Sales in Hyderabad: మందుబాబుల దండయాత్ర...దసరాను మించిన దమాకా...లిక్కర్ సేల్స్ ఎంతంటే..!

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో తొలిరోజు మద్యం ద్వారా రూ.68 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెప్పారు. సరిహద్దుల్లోని ఏపీ మద్యం షాపులకు తమిళులు కూడా ఎగబడటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఏపీ కంటే రెండ్రోజులు ఆసల్యంగా తెలంగాణలో దారుఖానాలు తెరుచుకున్నాయి. ఫస్ట్ డే రూ.90కోట్లపైచిలుకు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకంటే ఆలస్యంగా.. తమిళనాడులో గురువారం వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి. కాగా, తాగడంలో మాత్రం మేమే తోపులమని తమిళులు నిరూపించుకున్నారు.

Tamil Nadu govt earns Rs 172 crore on first day of sales, highest in south states

తమిళనాడులో తొలిరోజు ఏకంగా రూ.172 కోట్ల మద్యం అమ్మినట్లు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టస్మాక్) శుక్రవారం వెల్లడించింది. తమిళనాడులో మొత్తం 5,146 మద్యం దుకాణాలు ఉన్నాయి. మామూలు రోజుల్లో యావరేజిగా రోజుకు రూ.80 కోట్ల అమ్మకాలు సాగుతుంటాయి. అయితే లాక్ డౌన్ సడలింపుల తొలిరోజైన గురువారం మాత్రం కేవలం 3,750షాపులే తెరుచుకున్నా... అమ్మకాలు మాత్రం రికార్డు స్థాయిలో రూ.172కోట్లకు జరగడం విశేషం. తాగడంలో తమిళులే తోపని, తమ దరిదాపులకు కూడా తెలుగోళ్లు రాలేరని తంబీలు తెగ నీలుగుతున్నారు. దీనిపై మన మందుబాబులు ఎలా స్పందిస్తారో చూడాలిమరి.

ఏపీలో తొలిరోజు మద్యం షాపుల వద్ద జనం విపరీతంగా గుమ్మికూడటం, పోలీసులు లాఠీచార్జి చేయడం తెలిసిందే. తెలంగాణలో మందుబాబులు కాస్త నియంత్రణ పాటించినా, తమిళనాడులో మాత్రం లిక్కర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఫిజికల్ డిస్టెన్స్ రూల్ కి పాతరేసి గుంపులుగా చేరారు. ఐదుగురికంటే ఎక్కవ మంది గుంపుగా కనిపించొద్దన్న హైకోర్టు సూచనను కూడా ఎవరూ పట్టించుకోలేదు. మందుబాబుల్ని క్యూల్లో నిల‌బెట్టేందుకు పోలీసులు నానాపాట్లు పడాల్సి వ‌చ్చింది. మూడు రాష్ట్రాల్లోనూ మద్యానికి వ్యతిరేకంగా మహిళలు రోడ్లెక్కి నిరసనలు చేశారు.

English summary
Tamil Nadu govt has opened up the state-owned Tasmac liquor shop, earning Rs 172 crore huge revenues of Day 1. where as andhra pradesh Day 1 liquor revenue was rs.68 crore and telangana rs. 90 cr only
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X