Udhayanidhi Stalin: అంటరానితనం పోవాలంటే.. సనాతనధర్మం నిర్మూలించాల్సిందే..
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. సనాత ధర్మం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. గతంలో సనాతధర్ం పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. మనుషుల మధ్య ఉన్న అంటరాని తనం పోవాలంటే.. సనాతన ధర్మం అంతమొందాలన్నారు. అప్పుడే అంటరానితనం పోతుందని చెప్పారు. సనాతన ధర్మం వల్లే అంటరానితనం వచ్చినట్లు పేర్కొన్నారు.
సనాతన ధర్మం, అంటరానితనం రెండు కవల పిల్లలని చెప్పారు. సమాజంలో ఉన్న అంటరానితనం పోవాలంటే.. సనాతనధర్మం నిర్మూలన కావాలన్నారు. ఉదయనిధి స్టాలిన్ కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. అయితే ఆయన ఎక్కడా వెనక్కు తగ్గకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను సమర్థిస్తూ తాజాగా మరో సారి సనాతన ధర్మంపై మాట్లాడారు.

సనాతన ధర్మం నిర్మూలన అయితే అంటరానితనాన్ని కూడా నాశనం అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికే తాను సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని స్పష్టం చేశారు. సనాతనాన్ని నాశనం చేస్తే అంటరానితనం కూడా నశించిపోతుందని తాను నమ్ముతున్నాను తేల్చి చెప్పారు. ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనావైరస్ వంటి వ్యాధులతో పోల్చారు.
"కొన్ని విషయాలను వ్యతిరేకించలేము, వాటిని అసహ్యించుకోవాలి అంతే. డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనాను మనం వ్యతిరేకించలేం, మనం వాటిని నిర్మూలించాలి. అంతే. మనం సనాతనాన్ని ఎలా నిర్మూలిస్తాము. సనాతనాన్ని వ్యతిరేకించే బదులు దానిని నిర్మూలించడం ఉత్తమం" అని ఉదయనిధి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications