7 ఏళ్ల బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్, నీటిలో ముంచి దారుణ హత్య, నరాలు నలిపేశారు, ఎన్ కౌంటర్ చెయ్యండి
చెన్నై/ తిరుచెందూర్: ఉదయం ఇంట్లో టిఫిన్ చేసిన 7 ఏళ్ల అమ్మాయి స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బయకు వెళ్లింది. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలిక కిడ్నాప్ అయ్యింది. రహదారి సమీపంలోని నీటి ట్యాంకులో బాలిక శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు అటవి ప్రాంతంలో గాలించి ఇద్దరు యువకులను పట్టుకున్నారు. బాలిక మీద అత్యాచారం చేసి నీటి తొట్టిలో ముంచి చంపేశామని కామాంధులు అంగీకరించారు. ఆవేశంతో రగిలిపోయిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు ఇద్దరు కామాంధులను పట్టుకుని నరాలు చితికిపోయేలా దేహశుద్ది చేశారు. కామాంధులను ఎన్ కౌంటర్ చెయ్యాలని స్థానికులు ఆందోళనకు దిగారు.

స్నేహితుల కోసం వెళ్లిన అమ్మాయి
తమిళనాడులోని తుత్తూకుడి జిల్లా తిరుచెందూరు సమీపంలోని శాంతనకులం ప్రాంతంలో కల్వల్లై గ్రామం ఉంది. ఈ గ్రామం అటవి ప్రాంతం సమీపంలో ఉంది. కల్వల్లై గ్రామంలో నివాసం ఉంటున్న 7 ఏళ్ల బాలిక ఉదయం ఇంట్లో తల్లి చేసిన టిఫిన్ తిని స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా బాలిక ఆచూకిలేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేదు.

నీటి ట్యాంక్ లో శవమైన బాలిక
కల్వల్లై గ్రామంలోని పశువులకు నీళ్లు తాగించడానికి రహదారి పక్కనే పెద్ద నీటి ట్యాంక్ నిర్మించారు. బాలిక కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు అనుమానం వచ్చి నీటి ట్యాంకులో పరిశీలించారు. మాయం అయిన బాలిక నీటి ట్యాంక్ లో శవమై కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చి తిరుచెందూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అడవిలో కామాంధులు
పోలీసులు నీటి తొట్టిని పరిశీలించి బాలిక మృతదేహాన్ని బయటకు తీసి తిరుచెందూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కల్వల్లై గ్రామం పరిసర ప్రాంతాల్లోని అటవి ప్రాంతంలో గాలించారు. అటవి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తూత్తుకుడికి చెందిన ముక్తీశ్వరన్, అతని స్నేహితుడు సెల్వాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

నరాలు నలిపేసిన స్థానికులు
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్స్ ఇస్తామని నమ్మించి కిడ్నాప్ చేసి అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశామని ఇద్దరు కామాంధులు పోలీసుల విచారణలో అంగీకరించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసుల అదుపులో ఉన్న ముక్తీశ్వరన్, సెల్వాను బలవంతంగా అదుపులోకి తీసుకుని నరాలు చితికిపోయేలాగా ఉతికేశారు. ఇద్దరి కాళ్లు, చేతులు కట్టేసి స్థానికులు దాడి చెయ్యడంతో కామాంధులు ఇద్దరికి తీవ్రగాయాలైనాయి.

ఎన్ కౌంటర్ చెయ్యండి
7 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసిన ఇద్దరు కామాంధులను ఎన్ కౌంటర్ చెయ్యాలని స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులు గట్టిబందోబస్తుతో ముక్తీశ్వరన్, సెల్వాను తిరుచెందూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత వారం రోజుల్లో తూత్తుకుడి పరిసర ప్రాంతాల్లో బాలికలపై లైంగిక దాడులు జరగడం ఇది మూడోసారి కావడంతో స్థానికంగా ఉంటున్న అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications