వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయండి!..: తమిళనాడు ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

తూత్తుకుడి: వేదాంత సంస్థకు చెందిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాల్సిందిగా తూత్తుకుడిలో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పులతో 13మంది ఆందోళనకారులు చనిపోవడం తూత్తుకుడి ఘటనను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది.

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సైతం ప్రజాభీష్టం మేరకే నడుచుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతున్నట్టు సమాచారం.

Tamil Nadu seeks permanent closure of Vedanta copper smelter, say officials

జిల్లాకు చెందిన ఉన్నతాధికారి సందీప్ నండూరి దీనిపై మాట్లాడుతూ... 'ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉంది. ఫ్యాక్టరీ నడవాలని ప్రభుత్వం కోరుకోవట్లేదు' అని చెప్పారు. రాష్ట్ర సీనియర్ ప్రభుత్వాధికారులతో చర్చల అనంతరం సందీప్ ఈ ప్రకటన చేశారు.

కాగా, తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారంపై పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీ కారణంగా గాలి, నీరు పూర్తిగా కలుషితమై ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం పడుతోందని అన్నారు.

అంతకుముందు గురువారం ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం సంస్థ చేసుకున్న దరఖాస్తు ప్రస్తుతం కాలుష్య నియంత్రణ బోర్డు వద్ద పెండింగ్ లో ఉంది. కానీ బోర్డు నుంచి
అనుమతి రాకముందే ప్రొడక్షన్ మొదలుపెట్టడానికి స్టెరిలైట్ సిద్దమైనట్టు అధికారులు గుర్తించారు.

వేదాంత సంస్థ అధికారులు మాత్రం తమపై వస్తున్న ఆరోపణల పట్ల స్పందించడం లేదు. పైగా ఫ్యాక్టరీ కారణంగా గాలి, నీరు కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలను ఇంతకుముందు సంస్థ కొట్టిపారేసింది.

మరోవైపు బుధవారం దీనిపై స్పందించిన తమిళనాడు కాలుష్య నియంత్ర బోర్డు.. '2018-2023 కాలానికి ఫ్యాక్టరీని తిరిగి పునరుద్దరించాలని కోరుతూ స్టెరిలైట్ యాజమాన్యం చేసిన దరఖాస్తును తిరస్కరించాం. నిబంధనలకు విరుద్దంగా ఫ్యాక్టరీ నడుస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఒక ప్రకటనలో తెలిపింది.

అనుమతులు లేకుండా వేదాంత సంస్థ స్టెరిలైట్ ఫ్యాక్టరీని నడపడం కుదరదని కాలుష్య నియంత్రణ మండలి బోర్డు పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫ్యాక్టరీకి విద్యుత్ నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

ఇదిలా ఉంటే గత 50రోజుల నుంచి ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. పర్యావరణ అనుమతులు వచ్చేదాకా జూన్ 6వ తేదీ వరకు ఫ్యాక్టరీని నడపవద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

English summary
Tamil Nadu said on Thursday that it was seeking a permanent closure of a big copper smelter run by London-listed Vedanta Resources after 13 people died in protests demanding the closure of the plant on environmental grounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X