నా భర్త కామాంధుడు: అమ్మాయిలు, ఆంటీల మీద కన్ను పడిందంటే కసితో సర్వనాశనం, టిక్ టాక్, భార్య!

చెన్నై/ కడలూర్: తన భర్త కామంతో రగిలిపోతున్నాడని, కసితో అతని కన్ను అమ్మాయిలు, ఆంటీల మీదపడి వారు సర్వనాశనం అవుతున్నారని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. టిక్ టాక్ పేరుతో మహిళలు, యువతులకు వల వేస్తున్న తన భర్త వారిని వివాహం చేసుకుని కామం తీర్చుకుని వారిని గాలికి వదిలేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. ఇంతకు ముందే తాను, పోలీసులు వార్నింగ్ ఇచ్చినా ఎలాంటి మార్పు లేని భర్త మీద భార్య పోరాటం చేస్తోంది.

హ్యాపీగా సంసారం

హ్యాపీగా సంసారం

తమిళనాడులోని కడలూరు జిల్లా పనదుర్తి ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజశేఖరన్ అలియాస్ రాజశేఖర్ కి, విసూరు నివాసి సుకన్యకు 2014లో వివాహం అయ్యింది. రాజశేఖరన్, సుకన్య దంపతులకు దార్నికా (3) అనే కుమార్తె ఉంది. కుమార్తె దార్నికాతో కలిసి రాజశేఖరన్, సుకన్య దంపతులు కొన్ని సంవత్సరాలు హ్యాపిగా ఉన్నారు.

మహిళల మీద కన్ను పడింది

మహిళల మీద కన్ను పడింది

రాజశేఖరన్ కొంత కాలం నుంచి అమ్మాయిలు, ఆంటీల మీద కన్ను వేశాడు. ఎలాగైనా వారిని అనుభవించాలని కామంతో రగిలిపోతున్నాడు. గత మూడేళ్లుగా భార్య సుకన్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎక్కువ కట్నం తీసుకురావాలని, లేదంటే నిన్ను, నీ కుమార్తెను వదిలేస్తానని సుకన్యను టార్చర్ పెడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

భార్యకు అనుమానం

భార్యకు అనుమానం

గత రెండు సంవత్సరాల నుంచి భర్త రాజశేఖరన్ వేధింపులు ఎక్కువ కావడంతో సుకన్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు వేరే మహిళలతో అక్రమ సంబంధం ఏమైనా ఉందా ? అనే అనుమానంతో సుకన్య ఆరా తీసింది. అదే సమయంలో రాజశేఖరన్ కు టిక్ టాక్ పిచ్చి ఉందని సుకన్య గుర్తించింది.

అమ్మాయిలు, ఆంటీలకు గాలం

అమ్మాయిలు, ఆంటీలకు గాలం

టిక్ టాక్ పేరుతో అందమైన అమ్మాయిలు, ఆంటీలు, మహిళలను రాజశేఖరన్ పరిచయం చేసుకుంటున్నాడు. వారితో కలిసి ఆడిపాడుతున్న తన భర్త వారితో శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని సుకన్య పసిగట్టింది. తనతో సంసారం చెయ్యకుండా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని సుకన్యకు తెలిసింది.

పోలీసు కేసు పెట్టిన భార్య

పోలీసు కేసు పెట్టిన భార్య

గత ఏడాది భర్త రాజశేఖరన్ ఆగడాలు ఎక్కువ అయిన విషయం సుకన్యకు తెలిసింది. టిక్ టాక్ పేరుతో రాజశేఖరన్ పరిచయం అయిన అమ్మాయిలను వివాహం చేసుకుని వారితో కామవాంఛ తీర్చుకున్న తరువాత వారిని దూరం పెట్టి వేరే మహిళలకు గాలం వేస్తున్నాడని తెలుసుకున్న సుకన్య కదంబులియూర్ పోలీస్ స్టేషన్ లో భర్త మీద కేసు పెట్టింది. పోలీసులు రాజశేఖరన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చి ఇక ముందు బుధ్దిగా ఉండాలని హెచ్చరించి పంపించారు.

సోషల్ మీడియాలో వల

సోషల్ మీడియాలో వల

పోలీసులు వార్నింగ్ ఇచ్చిన తరువాత కొంత కాలం బుధ్దిగా ఉన్న రాజశేఖరన్ మళ్లీ అతని అసలు స్వరూపం బయట పెట్టాడు. మళ్లీ రగిలిపోయిన భార్య సుకన్య కదంబులియార్ పోలీసులను ఆశ్రయించింది. అయితే రాజశేఖరన్, సుకన్యల కేసుతో విసిగిపోయిన పోలీసులు మీ రామయణం ఎక్కువ అయ్యిందని, మీ ఇంట్లోనే మీరుమీరు పంచాయితీలు చేసుకోవాలని సుకన్యకు చెప్పి పంపించేశారు.

టిక్ టాక్ తో ఆంటీతో సరసాలు

టిక్ టాక్ తో ఆంటీతో సరసాలు

పుదుకోటైకి చెందిన కవినయ అనే ఆంటీతో రాజశేఖరన్ పరిచయం పెంచుకున్నాడు. ఓ తమిళ సినిమా పాటతో రాజశేఖరన్, కనవియ డ్యాన్స్ చేస్తూ చిందులు వేసిన వీడియోను సోషల్ మీడియాలో సుకన్య చూసింది. కవినయతో తన భర్త రాజశేఖరన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న సుకన్య కడలూరు జిల్లా ఎస్పీ శ్రీ అభినయ్ కు ఫిర్యాదు చేసింది. తన భర్త దిగజారిపోయాడని, టిక్ టాక్ పేరుతో అనేక మంది మహిళల జీవితాలు నాశనం చేస్తున్నాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అభినవ్ కు ఫిర్యాదు చేసింది. సుకన్య ఆమె భర్త రాజశేఖరన్ మీద కేసు పెట్టిందని, విచారణ చేస్తున్నామని కడలూరు జిల్లా ఎస్పీ శ్రీ అభినవ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+