అమిత్ షాకు స్టాలిన్ మార్క్ పంచ్..! హిందీకి బానిసలు కాబోము..
భారత్ లో జాతీయ భాషగా హిందీని గుర్తించడంతో పాటు రాష్ట్రాల్లోనూ అమలుచేయించేందుకు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీన్ని ఇప్పటికే పశ్చిమబెంగాల్ తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ భాష అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు మండిపడుతున్నారు.
హిందీ ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న ఒత్తిడిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి ఘాటుగా స్పందించారు. అమిత్ షా ప్రయత్నాలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. తాము హిందీకి బానిసలు కాబోమంటూ తేల్చిచెప్పేశారు. అంతకుముందు శుక్రవారం ఢిల్లీలో అధికారిక భాషపై పార్లమెంటు కమిటీ 38వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఇందులో హిందీ భాషకు ఆమోదం తక్కువగా ఉన్నప్పటికీ, అందరూ వ్యతిరేకత లేకుండా హిందీని అంగీకరించాలని అమిత్ షా కోరారు.

హిందీ ఇతర భాషలకు పోటీ కాదని, అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారానే దేశం సాధికారత సాధిస్తుందని అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ కౌంటర్ ట్వీట్ చేశారు. హిందీ అంగీకారం కోసం కేంద్ర హోంమంత్రి @అమిత్‌షా చేస్తున్న ఒత్తిడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నాననన్నారు. ఇది హిందీయేతరులను లొంగదీసుకునే కఠోర ప్రయత్నం అన్నారు.
తమిళనాడు ఏ విధమైన హిందీ ఆధిపత్యాన్ని, ప్రయోగాన్ని తిరస్కరిస్తుందని స్టాలిన్ తేల్చిచెప్పేశారు. మన భాష, వారసత్వం మమ్మల్ని నిర్వచిస్తుందన్నారు. తాము హిందీకి బానిసలుగా ఉండబోమన్నారు. ఇప్పటికే కర్నాటక,పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో హిందీని రుద్దడంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయాన్ని అమిత్ షా గమనించాలని ఎంకే స్టాలిన్ కోరారు.
"కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలు కూడా హిందీ అమలును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గౌరవనీయులైన @అమిత్‌షా, దయచేసి పెరుగుతున్న ప్రతిఘటనను గమనించండి ! '1965 హిందీ అమలు వ్యతిరేక ఆందోళనల' నిప్పులు చెరిగిపోయేలా చేయడం అనాలోచిత చర్య." అంటూ ట్వీట్ చేశారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications