తమిళనాడు సీఎం స్టాలిన్.. CMO నుంచి పోస్టు వైరల్..!!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కున విజయ్ అని చెప్పేస్తాం.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ పెట్టిన కేవలం రెండు నెలల్లోనే విజయ్ టీవీకే పార్టీ రెండు కంచుకోటలుగా భావించే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్ని తుంగలో తొక్కి అధికారాన్ని కైవసం చేసుకుంది. విజయ్ విజయం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఓ ప్రభంజనం.. అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహనీయులు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ పెట్టి సీఎం అయ్యారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత వారి స్థానంలో విజయ్ చేరారు.

ఇక విజయ్ సీఎం అయిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల మద్యపాన నిషేధం అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే తాజాగా తమిళనాడులోని రైతులకు రుణ మాఫీ చేశారు. రూ. 50 వేల వరకు రుణ మాఫీ చేస్తూ సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.

tamilnadu CMO s Shocking Post on CM Stalin Creates Massive Viral Storm on Social Media Platform X

ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్తర్వులు తమిళంలో వెలువడ్డాయి. ఈ విశేషాలను ఎక్స్ లోని సీఎంఓ అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ ఆప్షన్ ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కే. స్టాలిన్ అని ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పోస్టు కింద సీఎం స్టాలిన్ అని హ్యాష్ ట్యాగ్ కూడా ఉండటంతో నెటిజన్లు ఈ పోస్టును సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నారు. గ్రోక్ ఏఐ ఇలా ఉందేంటి..? అని కామెంట్స్ పెడుతున్నారు. త్వరగా మార్చండి సర్ అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గ్రోక్ ట్రాన్స్ లేషన్ కూ రిప్ అంటూ మరికొంత మంది అంటున్నారు.

మరికొంతమంది నెటిజన్లు.. ఐదు ఎకరాల వరకు రైతు రుణమాఫీ అని చెప్పి కేవలం రూ. 50 వేలు మాఫీ చేయడం ఏంటని సీఎం విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం తమిళనాడు రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభమైందని అంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం విజయ్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై రిలీజ్ అయ్యే ప్రతి తమిళ సినిమా మొదటి వారం ఐదు షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు సీఎం విజయ్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+