Tamilnadu Exit Poll Results 2021 : ఎదురులేని డీఎంకే ఫ్రంట్- రిపబ్లిక్ టీవీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్జాయి. తమిళనాడు అసెంబ్లీకి హోరాహోరీగా సాగి పోరులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఫ్రంట్ ఏకపక్ష విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నట్లు రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అధికార అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకే కూటమికి భంగపాటు తప్పడం లేదని తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఇందులో డీఎంకే-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి ఏకంగా 160 నుంచి 170 స్ధానాలు కైవసం చేసుకోవచ్చని రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అధికార అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి కేవలం 58 నుంచి 68 సీట్లు దక్కవచ్చని తెలిపింది. దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమికి 4-6 స్ధానాలు, కమల్ హాసన్ నేతృత్వంలోని ఎంఎన్‌ఎం కూటమికి 0-2 స్ధానాలు దక్కవచ్చని రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది.

రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే ఐదేళ్లకోసారి కొత్త కూటమికి అధికారాన్ని అప్పగించే సంప్రదాయం ఉన్న తమిళనాడులో ఆ సంప్రదాయాన్ని మార్చి రెండోసారి అధికారం అందుకున్న అన్నాడీఎంకేకు ఈసారి దారుణ భంగపాటు తప్పడం లేదు. బీజేపీతో జత కట్టిన ఆ పార్టీని ఓటర్లు పూర్తిగా తిరస్కరించినట్లు అర్దమవుతోంది. అలాగే దినకరన్, కమల్‌హాసన్ నేతృత్వంలోని కూటములకూ నామమాత్రపు స్ధానాలే ఓటర్లు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications