తమిళనాడులో రాజకీయ వేడి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిసార్టుకు అనర్హత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై: కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ తమిళ రాజకీయాలు ఊపందుకున్నాయి. మళ్లీ అదే రిసార్ట్ పాలిటిక్స్ రిపీట్ అవుతున్నాయి. అనర్హత వేటు పడ్డ 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తిరునేల్వేలి జిల్లాలోని కోర్టాలంలోని రిసార్ట్‌కు తరలించారు దినకరన్. దీంతో మళ్లీ రాజకీయ వేడు రాజుకుంది. ఈ వారంలోనే వారిపై ఉన్న అనర్హత వేటుకు సంబంధించిన కేసు మద్రాస్ హైకోర్టు ముందుకు రానుంది. ఇక అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలంతా శశికళ దినకర్‌నల వర్గానికి చెందిన వారు కావడం విశేషం.

రిసార్ట్‌కు బయలు దేరే ముందు తామరభరణి నదిలో ప్రవిత్ర స్నానాలు
అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలంతా తామరభరణి నదిలో పవిత్ర స్నానాలను ఆచరించారు. ఆ తర్వాత రిసార్ట్‌కు బయలుదేరి వెళ్లారు. ఇక మద్రాస్ హైకోర్టు నుంచి తీర్పు వెలువడే వరకు వారంతా రిసార్ట్‌లో ఉంటారని వెట్రివేల్ చెప్పారు. అనర్హతవేటు పడ్డ ఎమ్మెల్యేలను సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో వారందరినీ రిసార్ట్‌కు తరలించినట్లు సమాచారం.

కీలకం కానున్న మద్రాస్ హైకోర్టు తీర్పు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో ఆ 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ ధనపాల్ గతేడాది సెప్టెంబర్‌లో అనర్హత వేటు వేశారు. సీఎం పళని స్వామిని మార్చాలంటూ వీరంతా గవర్నర్‌కు లేఖ రాశారు. అదే సమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. ఈక్రమంలోనే కోర్టు తీర్పు కీలకం కానుంది. ఒకవేళ కోర్టు స్పీకర్ విధించిన అనర్హత వేటును తొలగిస్తూ తీర్పు చెబితే ఇక వీరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగానే కొనసాగి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంది.

జయలలిత మృతి తర్వాత పార్టీలో బయటపడ్డ వర్గపోరు
ఈ ఏడాది జూన్‌లో కేసును విచారణ చేసిన ద్విసభ్య ధర్మాసనం వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పార్టీ రెబల్‌గా మారారు. వీకే శశికల నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను నాడు కూవతూరు రిసార్టుకు తరలించారు. అనంతరం పన్నీర్ సెల్వం తన వర్గపు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి పళని స్వామికి మద్దతు తెలపారు. ఈ క్రమంలోనే దినకరన్ తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను ముందుగా పుదుచ్చేరి ఆ తర్వాత కూర్గ్‌లకు తీసుకెళ్లారు. అంతకుముందే ముఖ్యమంత్రిని మార్చాల్సిందిగా గవర్నర్‌కు లేఖ రాశారు.
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయగా ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సభ్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 214 మంది సభ్యులే ఉన్నారు. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు 116 మంది సభ్యులు ఉన్నారు. ఇది 107కంటే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications