అమెరికా అడ్డుపడినా తగ్గేదేలే.. భారత్ ఎకానమీ పైపైకి..
2025-26 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ గ్రోత్ ను సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. భారత్ పై అమెరికా టారిఫ్ లు విధించినా వాటిని తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్లినట్లు కేంద్ర ఆర్థికశాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ విభాగం ఇచ్చిన రిపోర్టులో స్పష్టమైంది. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడిందని తెలిపింది. దేశంలో అలాగే ప్రపంచంలో టారిఫ్ లు ఇతర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా వృద్దిని నమోదు చేసిందని నివేదికలో పేర్కొంది.
అమెరికా లాంటి దేశాలు భారత్ పై పన్నులు విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఆర్థిక మూలాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే ఇవే ఇప్పుడు అభివృద్ధి ఫలాలను అందించినట్లు స్పష్టం అవుతోంది. అలాగే భారత్ లో ఇటీవలి కాలంలో తీసుకొస్తున్న సంస్థాగత మార్పులు, సంస్కరణలు, పాలసీలు దేశ ప్రజలపై పాజిటివ్ విధానంలో ప్రభావం చూపుతున్నాయని దానివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నమోదు చేసిందని నివేదికలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవల జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు, దసరా, దీపావళి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని దీనివల్ల భారత్ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ విధానంలో దోహదపడ్డాయని తెలుస్తోంది. ప్రజల్లో స్వదేశీ వస్తువులపై డిమాండ్ ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావడం, మానిటరీ విధానంలో సడలింపులు, జీఎస్టీ సంస్కరణలను కొనసాగించడం.. తదితర కారణాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుతో దూసుకెళ్లినట్లు స్పష్టం చేసింది రిపోర్టు.
ఇటీవల ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం భారత వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.8 శాతం మధ్యలో ప్రొజెక్ట్ చేశాయి. భారత సేవల రంగంలో ఎగుమతులు గణనీయంగా పెరుగుదల కారణంగా భారత వాణిజ్యం దూకుడుగా సాగుతోందని వివరించింది. అలాగే భారత్ లోకి విదేశీ పట్టుబడులు కూడా పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ లోని పలు రాష్ట్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నట్లు తాజా రిపోర్టు వివరించింది.

జీఎస్టీ రేట్లను తగ్గించడం కారణంగా వినియోగదారులు, వ్యాపారులపై పన్నుల భారం తగ్గినట్లు పేర్కొంది. అయితే ప్రపంచ మార్కెట్లలో మాత్రం ఒడిదుడుకులు అలాగే కొనసాగుతున్నాయని అవి భారత్ పై ప్రభావం చూపకుండా ఎప్పటికప్పుడు భారత్ సంస్కరణలతో ముందుకెళ్లాలని రిపోర్టు స్పష్టం చేసింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications