'బిగ్ బాస్' ఆఫర్‌ను తిరస్కరించిన తస్లీమా నస్రీన్
న్యూఢిల్లీ: ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించింది. కలర్స్ ఛానెల్‌లో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షో బిగ్ బాస్ 8లో పాల్గొనమని ఆమెకు ఆహ్వానం అందింది. అయితే ఈ ఆఫర్‌ను తస్లీమా తిరస్కరించారు.
బిగ్ బాస్‌లో పాల్గొనడం ద్వారా ప్రపంచానికి తస్లీమా నస్రీన్ అంటే ఏమిటో తెలియజేయవచ్చని, దీంతో పాటు మంచి పారితోషికం కూడా ఇస్తామని బిగ్ బాస్ వర్గాలు తనను సంప్రదించాయని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు. అయితే దీనిని తిరస్కరించినట్టు తెలిపారు.

కాగా, ఇటీవలే కేంద్రప్రభుత్వం తస్లీమా నస్రీన్ భారత్‌లో నివసించేందుకు రెండు నెలల రెసిడెన్షియల్ వీసాను జారీ చేసేందుకు అంగీకరించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆమె కలిశారు. తాను భారత్‌లో ఎక్కువకాలం ఉండేందుకు వీసా గడువు పెంచాలని మంత్రిని కోరారు.
భారత్‌లో నివాస అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 1 నుంచి రెండు నెలల పాటు ఉండేందుకు అనుమతించింది. అయితే, దీర్ఘకాలం ఉండేందుకు ఆమె చేసిన విజ్ఞప్తిని పెండింగ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో ఆమె రాజ్‌నాథ్ కలసి కోరారు. 1994లో బంగ్లాదేశ్ నుంచి స్వీయ బహిష్కరణ తర్వాత ఇండియన్ వీసా మీద 2004 నుంచి తస్లిమా ఇక్కడే ఉంటున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications