విమాన ప్రమాదం మృతుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితుల కోసం రూ. 500 కోట్లతో సంక్షేమ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు టాటా సన్స్, టాటా ట్రస్ట్ లు తెలిపాయి. ఈ మొత్తంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్‌లు రూ. 250 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
జూన్ 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు.

అయితే ఈ ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్ప కూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.అయితే ఇంతటి ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రమే బతికి బయట పడ్డాడు. అతడే 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేశ్. అతడు 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కుప్పకూలిన ఘటనలో అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు.
అయితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఇచ్చిన ప్రాధమిక నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి కొన్ని సెకన్ల ముందు పైలట్లలో ఒకరు మరొకరితో మాట్లాడుకున్నట్లు తేలింది. ఆయిల్ స్విచ్ ఎందుకు ఆపేశారని అడిగితే ఇంకొకరు తాను ఆపలేదని చెప్పినట్లు తేల్చింది. తిరిగి ఆయిల్ స్విచ్ ఆన్ చేసే లోపే విమానం కుప్పకూలిందని తెలిపింది. దీంతో విమాన ప్రమాదానికి పైలట్ల నిర్లక్ష్యంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications