Tata Group: టాటా గ్రూపులో విభేదాలు ? ఛైర్మన్ వర్సెస్ ట్రస్టీలు? కేంద్రం జోక్యం..!
దేశంలోనే అతిపెద్ద కార్పోరేట్ సంస్థ టాటా గ్రూపులో విభేదాలు తలెత్తాయి. రతన్ టాటా మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చూస్తున్న ఆయన సోదరుడు, ఛైర్మన్ నోయెల్ టాటాకు వ్యతిరేకంగా టాటా ట్రస్ట్ లో ట్రస్టీలుగా ఉన్న వారు గళం విప్పడం, ఆయనతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటికి రావడంతో కేంద్రం జోక్యం చేసుకుంది.
టాటా ట్రస్ట్‌లలోని నలుగురు ట్రస్టీల బృందం సూపర్ బోర్డ్ గా వ్యవహరించి, చైర్మన్ నోయెల్ టాటా అధికారాన్ని దెబ్బతీసిందని
కథనాలు వస్తున్నాయి. ఛైర్మన్ తో సంబంధం లేకుండా, ఆయన అధికారాన్ని పట్టించుకోకుండా ట్రస్టీలు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం మాతృసంస్ధ అయిన టాటా సన్స్ పైనా పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ కార్యకలాపాలు కూడా ప్రభావితం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగారు. టాటా సన్స్ ఛైర్మన్ తో పాటు ట్రస్టీలతో మాట్లాడారు. టాటా గ్రూపులో స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున టాటా గ్రూప్ నాయకత్వాన్ని వారు కోరినట్లు ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ , ట్రస్టీ డారియస్ ఖంబాటాకు ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో ముఖ్యంగా టాటా గ్రూపులో అంతర్గత విభేదాలు టాటా సన్స్ కార్యకలాపాలను ప్రభావితం చేయకుండా చూడాలని వారు ట్రస్టీలు, ఛైర్మన్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, గ్రూపు స్దిరత్వాన్ని పునరుద్ధరించాలని వారు సూచించారు. గ్రూప్‌ను అస్థిరపరిచే ట్రస్టీ చర్యలను తొలగించే అవకాశం ఉందని సమాచారం. గ్రూప్ పరిమాణం, మార్కెట్ ప్రభావం , ఆర్థిక ప్రాముఖ్యత దృష్ట్యా ట్రస్టుల మెజారిటీ వాటా ప్రజా బాధ్యత కలిగి ఉంటుందని మంత్రులు టాటా ప్రతినిధులకు గుర్తు చేశారు.

టాటా సన్స్‌తో సహా ఎగువ-స్థాయి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల లిస్టింగ్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశం , టాటా సన్స్ యొక్క రెండవ అతిపెద్ద వాటాదారు అయిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కోసం లిక్విడిటీ పరిష్కారం కోసం అన్వేషణ వంటి నియంత్రణా విషయాలు ఈ చర్చలలో ఉన్నాయని తెలుస్తోంది. మంత్రులతో భేటీ తర్వాత నలుగురు టాటా ప్రతినిధులు ముంబైకి తిరిగి వెళ్లే ముందు క్లుప్తంగా అంతర్గతంగా చర్చించినట్లు తెలుస్తోంది. రేపు రతన్ టాటా వర్ధంతి సందర్భంగా జరిగే స్మారక కార్యక్రమానికి వీరు హాజరు కానున్నారు.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications