టిసిఎస్ టెక్కీపై అత్యాచారం: ఆ తర్వాత హత్య

TCS employee sexually assaulted, murdered: Tamil Nadu police
చెన్నై‌: తమిళనాడు రాజధాని చెన్నై టిసిఎస్‌లో పనిచేసిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగిని ఉమామహేశ్వరిపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ టెక్కీ హత్య కేసులో ఇద్దరు నిందితులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న ఆమె హత్యకు గురయితే 9 రోజుల తర్వాత శవం టిసిఎస్‌కు అర కిలోమీటర దూరంలోని సిప్‌కాట్ ఐటి పార్కు వద్ద కనుగొన్నారు.

ఇద్దరు భవన నిర్మాణ కూలీలే టెక్కీపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వీరిద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెదినవారు చెందినవారు. టెక్కీ హత్య జరిగిన తర్వాత సంఘటనకు సమీపంలో ఉన్న భవన నిర్మాణానికి ఇద్దరు కూలీలు రావడంలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే హత్యోదంతం గురించి వారు వివరించారు.

ఆ రోజు టెక్కీ ఉమామహేశ్వరి రాత్రి పొద్దుపోయాక 10 గంటల ప్రాంతంలో ఒక్కతే కార్యాలయం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు కూడా సరిగా లేకపోవడంతో చీకటిగా ఉంది. ఆ స్థితిలో అక్కడే ఉన్న తామిద్దరం ఆమెను అటకాయించి, ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు వారు పోలీసు విచారణలో తెలిపారు.

అత్యాచారం చేసిన అనంతరం ఆమె పొట్టపైనా, మెడపైనా గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఫిబ్రవరి 22న గుర్తు తెలియని శవంగా తొలుత భావించినా అది టెక్కీదేనని తేలడంతో నిందితుల కోసం వేట సాగించారు. ఎట్టకేలకు కూలీలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. దీంతో సిప్కాట్ వద్ద భద్రతను పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+