TCS: టీసీఎస్ లేఆఫ్ ఉద్యోగులకు భారీ ఊరట..! కీలక ప్రకటన..!
టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగుల లేఆఫ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. లేఆఫ్ ఇచ్చిన ఉద్యోగుల్ని సైతం పూర్తి పరిహారం ఇవ్వకుండానే తక్షణం సాగనంపుతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఐటీ ఉద్యోగుల సంఘాలు నిరసనలకు కూడా దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ ఇవాళ కీలక ప్రకటన చేసింది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో 2 శాతం ఉద్యోగుల్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు టీసీఎస్ చేసిన ప్రకటనపై నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఇవాళ కీలక ప్రకటన వచ్చింది. తాజా మార్పుల్లో తొలగించిన ఉద్యోగులకు సంరక్షణ, మద్దతు అందిస్తున్నట్లు సంస్ధ వెల్లడించింది. తమ కంపెనీ విలువలకు అనుగుణంగా, నైపుణ్యాలను తిరిగి అందించేందుకు తాము ఇటీవల తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభావితమైన వారికి ప్రతి వ్యక్తిగత పరిస్థితులలో ఇవ్వాల్సిన సంరక్షణ, మద్దతు అందిస్తున్నట్లు తెలిపింది.

మన దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్ధ అయిన టీసీఎస్.. కంపెనీ అవసరాలకు అనుగుణంగా లేని నైపుణ్యాలు కలిగిన దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రెండేళ్ల జీతం వరకు విరమణ ప్యాకేజీలను అందిస్తున్నట్లు గతంలో కథనాలు వచ్చాయి.
ప్రస్తుతం భారత ఐటీ రంగం నెమ్మదిగా వృద్ధిని ఎదుర్కొంటోంది. పరిశ్రమ మార్గదర్శకత్వం , ఇటీవలి ఫలితాలు 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల అంచనాలు ఇచ్చాయి. అలాగే ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, క్లయింట్ ఖర్చు ఆప్టిమైజేషన్ , నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కారణంగా ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొందని కీలక సూచికలు చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని ఊరికే వదిలేయడం లేదని, వారికి అవసరమైన మద్దతు అందించడం ద్వారా కొత్త ఉద్యోగాల్లో చేరేందుకు సహకరిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఇప్పటికే పలువురు లేఆఫ్ తీసుకున్న ఉద్యోగులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తమకు ఎదురైన అనుభవాలపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో టీసీఎస్ చేసిన ప్రకటన వారికి ఊరటనిచ్చేలా ఉంది. దీన్ని ఇండస్త్రీ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి.












Click it and Unblock the Notifications