నీతిమాలిన టీచర్: బాలికపై లైంగిక వేధింపులు

బాధిత బాలిక శనివారం సాయంత్రం చురమణిపురాలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు ఆరూప్ దత్తా(62) వద్దకు ప్రైవేటు ట్యూషన్ నిమిత్తం వెళ్లింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఇంటికి చేరుకున్న బాలిక తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు గమనించిన తన తల్లి ఆమెను ప్రశ్నించగా జరిగిన విషయం బాధిత బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వేధింపుల విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని తనను బెదిరింపులకు గురి చేసినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులకు తెలిపింది.
దీంతో ఈ విషయంపై బాధిత బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు అరూప్ దత్తాను అరెస్ట్ చేసినట్లు దోమ్జూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications