గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య-బీజేపీ అభ్యర్ధిగా పోటీ..?
గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా సిద్ధమవుతోంది. ఇవాళ ఈ జాబితాను బీజేపీ ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందులో పలు కొత్త ముఖాలకు చోటు కల్పించాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు కూడా చోటు దక్కబోతున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్ల క్రితమే బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. దీంతో రివాబా పేరు కూడా ఈ జాబితాలో ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో .. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ వంటి సీనియర్ నేతలను పోటీకి దింపకపోవచ్చని తెలుస్తోంది. దీనికి కారణం వారంతా 75 ఏళ్లు దాటిన వారే. అలాగే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల బంధువులు కూడా అనర్హులు.

జడేజా భార్య రివాబా జడేజా మెకానికల్ ఇంజనీర్. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత హరిసింగ్ సోలంకికి బంధువు కూడా. 2016లో రవీంద్ర జడేజాను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆమె రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన కర్ణి సేనకు కూడా నాయకురాలుగా ఉన్నారు. దీంతో ఆమెను రంగంలోకి దింపడం ద్వారా రాజ్ పుట్ల ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత క్రికెటర్ భార్య మినహా ఆమె ఇప్పటివరకూ బీజేపీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం మైనస్.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications