విపక్షాల్ని వాగ్నర్ గ్రూప్ తో పోల్చిన ఉద్ధవ్ థాక్రే- బీజేపీ సర్కార్ కూల్చివేత ఖాయం..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పై పోరు కోసం ఏకమైన ఉమ్మడి విపక్షాలు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి విపక్షంలో భాగమైన మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే పార్టీ.. ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉమ్మడి విపక్షాన్ని తాజాగా రష్యాలో తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ తో పోల్చిన ఉద్దవ్ పార్టీ.. త్వరలో ఇది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేస్తుందని వ్యాఖ్యానించింది.
భారతదేశంలోని "వాగ్నర్ గ్రూప్" (ఉమ్మడి విపక్షం) అహింసా మార్గాన్ని ఉపయోగించి బ్యాలెట్ బాక్స్ ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించబోతోందని శివసేన (యుబిటి) ఇవాళ తెలిపింది. రష్యాలో నాటకీయ పరిణామాల మధ్య తిరుగుబాటు చేసిన వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్.. 24 గంటల పాటు అధ్యక్షుడు పుతిన్ కు చుక్కలు చూపించింది. ఈ నేపథ్యంలో భారత్ లో ఉమ్మడి విపక్షాన్ని కూడా వాగ్నర్ గ్రూప్ తో పోలుస్తూ ఉద్ధవ్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేసింది.

శివసేన (యుబిటి) తమ పత్రిక సామ్నా సంపాదకీయంలో వాగ్నర్ కిరాయి దళం రష్యన్ అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటును గత వారం పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశంతో పోల్చింది. డజనుకు పైగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు శుక్రవారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో పాట్నాలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఐక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.ఇదే క్రమంలో "వాగ్నర్ గ్రూప్" (విపక్షం) నియంతృత్వాన్ని సవాలు చేయగలదని సామ్నా సంపాదకీయం పేర్కొంది.
ప్రధాని మోదీ అయినా, పుతిన్ అయినా వారు తిరుగుబాటును ఎదుర్కోక తప్పదని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వాన్ని అహింసా వాగ్నర్ తొలగిస్తుందని, ఆ మార్గం బ్యాలెట్ బాక్స్ ద్వారా ఉంటుందని వెల్లడించింది. పుతిన్‌లాగే ప్రధాని మోదీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లాలని పేర్కొంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications