వేధింపులా? ప్రేమా?: 8వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన గుల్షన్ చోప్రా బెంగళూరులో ఐటీ సెజ్‌లోని జెన్‌పాక్ట్ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం ఆఫీస్‌కు వెళ్లిన గుల్షాన్.. 8వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సోమవారం నైట్ షిప్ట్‌కు వెళ్లిన గుల్షన్ 11.20గంటల ప్రాంతంలో 8వ అంతస్థుపైకి బాత్రూమ్‌కని వెళ్లి కిటికీలోనుంచి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో గుల్షాన్ ఆత్మహత్యకు వృత్తిపరమైన ఒత్తిడే కారణమని భావిస్తున్నారు.

అయితే, తన కొడుకు ఆత్మహత్యకు కొత్తగా వచ్చిన రాహులే కారణమని గుల్షాన్ తండ్రి ఆరోపిస్తున్నాడు. కావాలంటే తన కొడుకుకి, రాహుల్‌కు మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలను పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టత వస్తుందని సూచించాడు.

Techie commits suicide by jumping from eighth floor of office building

ఇదిలా ఉంటే ఇటీవలే పంజాబ్‌లోని యువతితో కొద్దిరోజుల క్రితమే గుల్షాన్‌కు నిశ్చితార్థమైంది. నవంబర్‌లో వివాహం కూడా నిశ్చయించారు. ఇతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి వద్ద నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గుల్షన్ కు సీనియర్ అధికారుల నుంచి ఏమైనా వేధింపులు ఎదురయ్యాయా? అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.

అయితే జెన్‌పాక్ట్ సంస్థ మాత్రం ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు ఉండవని తేల్చి చెప్పింది. గుల్షన్ ఆత్మహత్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. విచారణకు తాము సహకరిస్తామని, అతని తల్లిదండ్రులకు కూడా మద్దతుగా ఉంటామని పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 28-year-old software engineer jumped from the eighth floor of his office building at the IT park Eco Spacein Bellandur late Monday night. Gulshan Chopra who hails from Jalandhar had been working as an analyst with Genpact for the last 1.5 years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి