వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలు తెస్తానని చెప్పి శవమైన సాప్ట్‌వేర్ ఇంజనీర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Techie leaps to death from 8th floor
పూణె: నాయనమ్మతో పాలు తెస్తానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్. ఈ ఘటన పూణెలోని మోషీలో జరిగింది. వివరాల్లోకి వెళితే, బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కనిష్క్ పుట్టిగె అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ నాయనమ్మతో పాలు తెస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చి బోసారీకి దగ్గరలోని మోషీ ప్రాంతంలో నిర్మాణదశలో ఉన్నఓ బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మంగుళూరుకి చెందిన కనిష్క్ పుట్టిగె పంప్రీలోని టాటా టెక్నాలజీస్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పంప్రీలోని కో ఆపరేటివ్ సొసైటీ నుండి రెండు వారాల ముందే మోషీలోని ప్రాధీకరణ్ అపార్ట్ మెంట్‌లోకి మారాడు. అతనిపాటు నాయనమ్మ లీలావతి అదే ఇంట్లో నివాసం ఉంటుంది. తన మనవడి మరణవార్త వినగానే ఆమె నిశ్చేష్టురాలైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

కనిష్క్ పుట్టిగె ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో సూసైడ్ నోట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోసారీ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కెఎల్ పవార్ మాట్లాడుతూ "తన చావుకి ఎవరూ బాధ్యులు కారు" అని సూసైడ్ నోట్‌లో రాసి ఉందని తెలిపారు.

తాను నివసిస్తున్న బిల్డింగ్ నుంచి తొలుత ఆత్మహత్య చేసుకోవాలని భావించినా.. అది కాస్త ఎత్తు తక్కువ ఉండటంతో ప్రక్కనే ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లి 8వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అంత ఎత్తు నుంచి దూకడంతో తలకు బలమైన గాయలు తగిలాయి. దాంతో అతను అక్కడికి అక్కడే చనిపోయాడని దర్యాప్తు అధికారి సంజన్ పాండే చెప్పారు. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం పింప్రీలోని యశ్వంత్రో చవాన్ మోమోరియల్ హాస్పిటల్‌కు ప్రైవేటు వాహనంలో తరలించారు.

English summary
Investigations show that Kanishka planned to jump off the building where he lived, but found it was not high enough. He then walked into the neighbouring under-construction Bhondwe building and jumped from the passage of the eighth floor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X