పెళ్లికి వెళ్లారు: అక్కను కట్టేసి చెల్లెలిపై గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. శుభకార్యానికి వెళ్లిన అక్కా, చెల్లెలిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే దారుణంగా హత్య చేస్తామని బెదిరించి వెళ్లారు.
బద్నాన్ జిల్లా ఎస్పీ సంజయ్ రాయ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 14 ఏళ్ల బాలిక తన అక్కతో కలిసి వివాహ వేడుకు వెళ్లింది. తరువాత ఐదు మంది నిందితులు వీరిద్దరిని కిడ్నాప్ చేశారు.

బదాన్ జిల్లాలోని సహస్వాన్ అనే ప్రాంతం సమీపంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లారు. అక్కను తాళ్లతో కట్టేసిన నిందితులు ఆమె ముందే బాలిక మీద ఐదు మంది సామూహిక అత్యాచారం చేశారని జిల్లా ఎస్పీ సంజయ్ రాయ్ చెప్పారు. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించామని, కేసు నమోదు చేసి పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ సంజయ్ రాయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications