Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉల్లిగడ్డలతో దండ: ధరల పెంపుపై తేజస్వీ యాదవ్ నిరసన, కేంద్రంపై ఫైర్..

బీహర్ అసెంబ్లీ మొదటి ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ముగియనుంది. అయితే ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఉల్లి ధరల పెంపు అంశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎత్తుకున్నారు. మోడీ హయాంలో ఏం కొనలేం, తిన లేం అంటూ ఉల్లి దండను పట్టుకొని నిరసన తెలియజేశారు.

ఉల్లి గడ్డ ధరల పెంపుతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారని తేజస్వీ యాదవ్ తెలిపారు. ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగిత.. ప్రజల పాలిట శాపంగా మారిందని చెప్పారు. ఉపాధి కోసం రైతులు, కూలీలు, యువత, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఇక చిన్న వ్యాపారులపై బీజేపీ ఉక్కుపాదం మోపిందని ధ్వజమెత్తారు.

Tejashwi Yadavs Onion Garland For BJP In Last Mile Of Bihar Campaign

రాష్ట్రంలో ఉపాధి కీలక అంశం అని తేజస్వీ యాదవ్ మరోసారి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ఉల్లి ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.60 కి విక్రయిస్తున్నారని.. రూ.80 అయితే పరిస్థితి ఏంటీ అని అడిగారు. రైతుల పరిస్థితి బాగోలేదు, యువతకు ఉపాధి లేదు.. రాష్ట్రంలో ఉన్న వారికి సరియైన విద్య లేదు. వైద్య సాయం కూడా లేదన్నారు.

ఉల్లిగడ్డ ధరలపై నియంత్రణ విధించాలని కేంద్రాన్ని కోరారు. లేదంటే కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అయ్యే అవకాశం ఉందన్నారు. ఉల్లి ధరల పెంపు నేపథ్యంలో శుక్రవారం హోల్ సెల్, రిటేల్ పరిమితిపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నది.

Recommended Video

    Bihar Polls 2020 : మరోసారి Nitish Kumar కు పట్టం కట్టబోతున్న బీహర్ ప్రజలు.. ABP సర్వే వెల్లడి!

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+