వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్న గవర్నర్ - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తమిళిసై సౌందరరాజన్

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు దీటుగా దూసుకుపోతోందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దూరదృష్టితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రి వర్గం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశాయని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

గవర్నర్‌ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఉండవని, విద్యుత్‌రంగం దెబ్బతింటుందని, పరిశ్రమలు రావని, అభివృద్ధి కుంటుపడుతుందని కొందరు దుష్ప్రచారం చేశారని, కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి పని చేసిందని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడిందని అన్నారు.

పలు వినూత్న పథకాలతో ప్రభుత్వం విమర్శకుల నోళ్లు మూయించిందని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో చీకటి ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందరూ కలిసికట్టుగా శ్రమించి అభివృద్ధికి బాటలు పరుచుకున్నామని, అయితే ఇది రాత్రికి రాత్రే సాధించిన విజయంకాదని గవర్నర్‌ అన్నారు.

రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ వివిధ రంగాలలో ఏ స్థాయిలో ఉందో, ఏ మేరకు ప్రణాళికలు అవసరమో ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన అనుభవంతో భవిష్యత్తు కార్యాచరణను రచించారని గవర్నర్‌ అన్నారు.

ఆర్ధిక రంగంలో క్రమశిక్షణలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచిందని, 2020-21 ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,27,145గా ఉంటుందని అంచనా వేసినట్లు గవర్నర్‌ తెలిపారు. ఇది 2013-14 ఆర్ధిక సంవత్సరం నాటికి రూ. 1 లక్షకుపైగా మాత్రమే ఉండేదని ఆమె అన్నారు.

2019-20నాటికి ఆర్ధిక మాంద్యం, 2020-2021కి కరోనా వైరస్‌ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపినా, దానిని తట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి అమలు జరిపిందని గవర్నర్‌ వెల్లడించారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ తీవ్రంగా శ్రమించారని ఆమె అన్నారు. అన్నివర్గాల వారికి కరోనా చికిత్సను ఉచితంగా అందించి ప్రభుత్వం ఎన్నో ప్రాణాలను నిలబెట్టిందని చెప్పారు.

మిషన్‌ భగీరథ పథకం మంచి నీటి సమస్యను తీర్చిందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, మారుమూల తండాలకూ కూడా తాగునీరు ఇవ్వడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందామని, తెలంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని గవర్నర్‌ వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో మంచి నీటి వ్యవస్థ కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేదని ఆమె తెలిపారు.

సులభతర వాణిజ్య విధానంలో దేశంలోని టాప్-3 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని, 15వేలకు పైగా పరిశ్రమలు, 15 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించామని గవర్నర్‌ తెలిపారు.

ఒక్క ఐటీ రంగంలోనే 250కి పైగా కొత్త కంపెనీల, 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని గవర్నర్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana budget meetings: Governor says more than 5 lakh jobs have been created in the IT sector alone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X