వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: టెలికంలో కొత్తగా 1.4 కోట్ల ఉద్యోగాలు, కానీ, మరో ఆర్నెళ్ళు కష్టాలే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్ళలో టెలికం రంగంలో 1.4 కోట్ల ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈఓ ఎస్‌పీ.కొచ్చర్ తెలిపారు.టెలికం రంగంలో ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు ఆ పరిశ్రమలో ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నట్టుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టెలికం రంగంలో కన్సాలిడేషన్ ప్రక్రియతో భారీగా ఉద్యోగాలను కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. టెలికం పరిశ్రమ పెద్ద ఎత్తున రెవిన్యూను కోల్పోయింది.అయితే తమ ఉనికిని నిలుపుకొనేందుకు గాను కొన్ని సంస్థలు టారిఫ్ ప్లాన్లను మార్చుకొన్న పరిస్థితులు కూడ లేకపోలేదు.

అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా టెలికం పరిశ్రమలో కూడ మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఈ తరుణంలో టెలికం పరిశ్రమలో కూడ రానున్న ఐదేళ్ళలో కొత్తగా ఉద్యోగావకాశాలు పొందే అవకాశాలున్నాయని టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ప్రకటించింది.

5 ఏళ్ళలో1.4 కోట్ల ఉద్యోగాలు

5 ఏళ్ళలో1.4 కోట్ల ఉద్యోగాలు

రానున్న ఐదేళ్ళలో టెలికం రంగంలో సుమారు 1.4 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు పొందే అవకాశం ఉందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈఓ ఎస్‌పీ కొచ్చర్ ప్రకటించారు. ఈ ప్రకటన టెలికం రంగంలో వారికి ఆశలను కల్పిస్తున్నాయి. ప్రస్తుతం టెలికం రంగంలో 40 లక్షల మంది ఉద్యోగాలు పొందుతున్నారు.

గతేడాది 40వేల మంది ఇంటిక

గతేడాది 40వేల మంది ఇంటిక

గత ఏడాది 40 వేల మంది టెలికం రంగంలో ఉద్యోగాలను కోల్పోయారు. వచ్చే ఆరు నుండి తొమ్మిది మాసాల వరకు ఇదే రకమైన పరిస్థితి టెలికం పరిశ్రమలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెలికం రంగంలో సుమారు 80 నుండి 90 వేల మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది.

టెలికం మౌలిక వసతుల్లో జాబ్స్

టెలికం మౌలిక వసతుల్లో జాబ్స్

రానున్న ఐదేళ్ళలో మిషన్‌ టూ మిషన్‌ కమ్యూనికేషన్స్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ బాడీ అభిప్రాయంతో ఉంది. టెలికాం తయారీ, మౌలిక సదుపాయాలు, సర్వీసెస్‌ కంపెనీల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ బాడీ సీఈఓ కొచ్చర్‌ ప్రకటించారు.

 ఎక్కువ ఉద్యోగావకాశాలు

ఎక్కువ ఉద్యోగావకాశాలు

ఎక్కువ తయారీ ప్రక్రియ భారత్‌కు వచ్చే సూచనలు ఉన్నాయని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ బాడీ సీఈఓ కొచ్చర్‌ అభిప్రాయపడ్డారు. తద్వారా టెలికాం రంగం ఎక్కువ అవకాశాలను సృష్టించనుందని తెలిపారు. ట్రైనింగ్‌ అనంతరం కల్పించే ఉద్యోగవకాశాల్లో ప్రభుత్వం తన విధానం మార్చుకోవాలని టెలికాం సెక్టార్‌ స్కిల్‌ బాడీ ప్రతిపాదించింది. ఒకవేళ వర్క్‌ఫోర్స్‌ ఎక్కువ స్కిల్‌తో ఉంటే టెలికాం సెక్టార్‌ అట్రిక్షన్‌ విషయంలో భయపడాల్సి ఉంటుందని కొచ్చర్‌ అన్నారు. ఆ భయాందోళనలను తగ్గించడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

English summary
The telecom industry, which has been witnessing job losses due to consolidation, is expected to create over 10 million employment opportunities in the next five years, as per the skill development body for the sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X