మొబైల్ రీఛార్జ్ ధరలు మళ్లీ పెంపు..? ఈ సారి భారీగానే..!
ప్రస్తుతం ప్రతీ వ్యక్తి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ప్రతి కుటుంబంలో రెండు మూడు ఆండ్రాయిడ్ ఫోన్ లు వచ్చేశాయి. ఈ క్రమంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బిగ్ షాక్ తగలనుంది. త్వరలో మొబైల్ రీఛార్జ్ ధరలను మళ్లీ పెంచేందుకు టెలికాం సంస్థలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే.
మొబైల్ ఫోన్ లు వినియోగించేవారికి బిగ్ షాక్ ఇచ్చేందుకు టెలికాం సంస్థలు రెడీ అవుతున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 10-12 శాతం చొప్పున రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య 108 కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. అయితే వీళ్లందరికీ మరోసారి భారీ షాక్ ఇచ్చేందుకు టెలికాం కంపెనీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఈ సారీ 10 నుంచి 12 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు టెలికాం సంస్థలకు యూజర్లు పెరగడం, 5జీ ఫీచర్లు నేపథ్యంలో ఈ పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. బేస్ ప్లాన్ ల జోలికి వెళ్లకుండా, మిడిల్, టాప్ ప్లాన్ల రేట్లు పెంచుతారని, కొన్ని ప్లాన్లలో కోత విధిస్తారని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం దేశంలో 5జీ వినియోగం భారీగా పెరిగిపోయింది. చిన్న చిన్న గ్రామాలకూ 5జీ వ్యాప్తి చెందింది. అంతేకాక యాక్టివ్ సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది. ఈ క్రమంలోనే మరోసారి రీఛార్జ్ ధరల పెంపు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. జూన్ తో పోల్చితే మే నెలలో మొబైల్ యాక్టివ్ యూజర్లు సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క నెలలోనే 74 లక్షల మంది కొత్తగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం ఓ రికార్డుగా విశ్లేషకులు చెబుతున్నారు.
#LeadStoryOnET | Your next phone recharge may cost more as telcos rethink plans amid subscriber boom https://t.co/1aC7K3kmY3 pic.twitter.com/UYCtbOBOhD
— Economic Times (@EconomicTimes) July 7, 2025
గతేడాది రీఛార్జ్ ప్లాన్ల ధరలను జియో, ఎయిర్ టెల్.. తదితర టెలికాం కంపెనీలు భారీగా పెంచేశాయి. ఈ ఏడాది చివరి నాటికి కూడా మొబైల్ టారిఫ్ లను 10 నుంచి 12శాతం మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రిలయన్స్ జియోలో కొత్తగా 55 లక్షల మంది చేరగా.. ఎయిర్ టెల్ కు 13 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. ఈ క్రమంలోనే టారిఫ్ ల పెంపుపై టెలికాం కంపెనీలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications