వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపితో పొత్తుపై బాబు చర్చ, టిపై అదే వైఖరన్న బిజెపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugu Desam hints at tie up with BJP
హైదరాబాద్/న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీతో పొత్తు అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మైనార్టీ నాయకులతో చర్చలు జరిపారు. టిడిపి, బిజెపిల మధ్య పొత్తు ఖాయం అని ప్రచారం జరుగుతున్న సమయంలో టిడిపి మైనారిటీ నాయకులు సలీం, జాహీద్ అలీఖాన్, మస్కతీలతో బాబు చర్చించడం గమనార్హం. ఈ ప్రచారంలో వాస్తవాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ నాయకులే అధినేతను కలిశారు.

దీంతో అధినేత.. టిడిపి, బిజెపిలు పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండని అడిగారట. బిజెపితో ప్రమాదం లేదు కానీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారంటే మైనారిటీల్లో వ్యతిరేకత ఉందని అన్నట్టు తెలిసింది. టిడిపి సెక్యులరిజానికి కట్టుబడి ఉందని, బిజెపితో మనం పొత్తుపెట్టుకున్నా, ఆ పార్టీని అదుపులో ఉంచవచ్చునని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారట.

తెలంగాణకు కట్టుబడ్డాం... మారేది లేదు: బిజెపి

మరోవైపు తెలంగాణపై తీసుకున్న విధాన నిర్ణయాన్ని ఏది ఏమైనా తమ పార్టీ మార్చుకోబోదని బిజెపి అగ్రనేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నాయకులను కలిసినంత మాత్రాన తెలంగాణ విషయంలో తాము వైఖరిని మార్చుకుంటున్నట్లు కాదన్నారు.

మంగళవారం ఢిల్లీ పార్టీ కార్యాలయంలో భారతీయ యువమోర్చా జాతీయ మీడియా వర్క్‌షాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, మోడీలు ఒకే వేదికను పంచుకోవటం యాదృచ్ఛికమని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు కూడా పాల్గొంటున్నారని ఆమె వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల గురించి స్పందిస్తూ తాము టిడిపితో కానీ, వైయస్సార్ కాంగ్రెసుతో కానీ ఇంత వరకూ ఎలాంటి చర్చలు జరపలేదని, అయితే పొత్తులు పెట్టుకోవటం పట్ల ఆసక్తిగా ఉన్నామని వివరించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలా లేదంటే జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోల్‌కాతాలో ఆయన వివరించారు.

English summary
While declinining to make any comment on the talk of Telugudesam alliance with BJP, TDP chief Nara Chandrababu Naidu indeed dropped sufficient hints about the same during an interaction with Muslim leaders of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X