Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చీక‌టి అధ్యాయానికి ప‌దేళ్లు..! 26/11 ఉగ్ర‌వాదుల దాడి అమానుషం..!!

హైద‌రాబాద్ : ముంబై పీడకలకు పదేళ్లు. 26/11 తేదీని త‌లుచుకుంటే భార‌త‌దేశం ఇప్ప‌టికి చిగురుటాకులా వ‌ణికి పోతుంది. 26న ముంబైలో జరిగిన మారణహోమం భార‌త్ నే కాకుండా యావత్ ప్రపంచాన్నీ వణికించింది. ఆరోజు జరిగిన ఉగ్రవాద దాడిలో 166 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం ఇంకా భార‌త ప్ర‌జ‌లు కార్చిన క‌న్నీటికి స‌జీవ సాక్షంగా నిలుస్తోంది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్‌ ఉగ్ర కుట్ర మ‌ళ్లీ పున‌రావ్రుతం ఐతే ప్ర‌త్య‌క్ష్య యుద్దం త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ చీక‌టి దారుణ మార‌ణ హోమాన్ని ఒక్క‌సారి నెమ‌రు వేసుకుందాం..!!

చిగురుటాకులా వ‌ణికిపోయిన ముంబాయి..! ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకున్న పౌరులు.!!

చిగురుటాకులా వ‌ణికిపోయిన ముంబాయి..! ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకున్న పౌరులు.!!

ఛత్రపతి శివాజీ టెర్మిసన్‌ రైల్వేస్టేషన్‌లో తొలి తూటా పేలింది. పేల్చింది.. అజ్మల్‌ కసబ్‌! కాసేపటికి.. నారీమన్‌ హౌస్‌లో మరో బృందం కాల్పులకు తెగబడింది. ఇక్కడి ఇజ్రాయెలీల నివాస సముదాయమైన ‘జూయిష్‌ చాబాద్‌'ను ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత.. విదేశీ పర్యాటకులు, స్థానికులతో కిటకిటలాడే విలాసవంతమైన ‘లెపార్డ్‌' కేఫ్‌లోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి చెలరేగిపోయారు. 15 నిమిషాలపాటు అక్కడ తూటాలతో విధ్వంసం సృష్టించి.. సమీపంలోని ‘తాజ్‌ హోటల్‌'లోకి చొరబడ్డారు. చివరగా.. ఒబెరాయ్‌ ట్రైడెంట్‌లోకి ఇద్దరు ఉగ్రవాదులు ప్రవేశించి మారణ హోమం ప్రారంభించారు. ఈ దారుణ మార‌ణ‌హోమానికి నేటితో ప‌దేళ్లు పూర్త‌వుతున్నాయి.

శివాజీ టెర్మిన‌ల్ లో ర‌క్త పాతం..! చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్న స్థానికులు..!!

శివాజీ టెర్మిన‌ల్ లో ర‌క్త పాతం..! చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్న స్థానికులు..!!

ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేషన్‌ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్‌ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్‌ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నాన‌ని, కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయిందని ఆనాటి జ్ఞాప‌కాల‌ను విష్ణు గుర్తు చేసుకున్నారు. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్‌ఫామ్‌ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పాన‌ని. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరానని అన్నారు. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న కసబ్‌ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు' అంటూ నాటి అనుభవాలను విష్ణు నెమ‌రు వేసుకొచ్చారు.

ఉగ్ర‌వాదుల అడ్డా పాక్..! య‌ధేఛ్చ‌గా మార‌ణ‌హోమం..!!

ఉగ్ర‌వాదుల అడ్డా పాక్..! య‌ధేఛ్చ‌గా మార‌ణ‌హోమం..!!

ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్‌ పౌరుడు కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్‌ కుమార్‌ రత్‌ కసబ్‌ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్‌ ఫ్రంటియర్స్‌: ది సీక్రెట్‌ హిస్టరీ ఆఫ్‌ ముంబై టెర్రర్‌ అటాక్స్‌' పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్‌కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్‌ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు.

మ‌రో సారి పున‌రావ్రుతం ఐతే యుద్దం త‌ప్ప‌దు..! అప్ర‌మ‌త్త‌మైన భార‌త్..!

మ‌రో సారి పున‌రావ్రుతం ఐతే యుద్దం త‌ప్ప‌దు..! అప్ర‌మ‌త్త‌మైన భార‌త్..!

అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్‌ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్‌ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్‌ పరోక్షంగా చెబుతోందిని ముంబై పోలీసులు చెప్పుకొస్తున్నారు. పోలీసులు దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్‌ గోయెల్‌ మాట్లాడుతూ ‘భారత్‌-పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్, అప్ప‌టి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్‌ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది' అని చెప్పారు. భార‌త్ సంయ‌మ‌నం కోల్పోతే యుద్దం త‌ప్ప‌ద‌నే అభిప్ర‌యాలు కూడా ప‌లు కోణాల‌నుండి వినిపించాయ‌ని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+