ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ
అసెంబ్లీ ఎన్నికల వేళ.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీకి బలాన్ని ఇచ్చినట్టయింది.
యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా దీన్ని పరిగణిస్తున్నారు. భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారులలో ఒకరైన పేస్ రాజకీయ ప్రవేశం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఒలింపిక్ పతకాలు, అనేక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన పేస్ రెండో ఇన్నింగ్ ను ఆరంభించినట్టయింది.

ఈ ఎన్నికల్లో లియాండర్ పేస్ పోటీ చేయకపోవచ్చు. ప్రచారంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. ఆయన పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని పార్టీ నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్‌కతాలో జన్మించారు పేస్. క్రీడా నేపథ్యంలో పెరిగారు. ఆయన తండ్రి వెంకట్రామన్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో హాకీలో కాంస్యం గెలిచారు. తల్లి జెన్నిఫర్ పేస్ 1980 ఆసియా బాస్కెట్‌బాల్ జట్టుకు నాయకత్వం వహించారు. గత ఏడాది లియాండర్ తండ్రి కన్నుమూశారు.
1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో బ్రెజిల్‌కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడు ఆయనే. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్‌తో పురస్కారాలను అందుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌లు గెలవకపోయినా, డబుల్స్‌లో మాత్రం రికార్డు సృష్టించారు.
పురుషుల డబుల్స్‌లో మొత్తం ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఇందులో 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లు అనేకసార్లు గెలుచుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ పేస్ 10 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు వింబుల్డన్, రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు ఇందులో ఉన్నాయి. ఈ అద్భుతమైన రికార్డు ఆయన్ని టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ డబుల్స్ ఆటగాళ్లలో ఒకరిగా నిలబెట్టింది.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
ఉలిక్కిపడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications