తమిళనాడు సీఎం పళనిసామికి సినిమా చూపిస్తున్న దినకరన్: ఎమ్మెల్యేలు జంప్ జిలాని!

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి టీటీవీ దినకరన్ ప్రతి రోజు నిద్రలేకుండా చేస్తున్నారు. ఏం మాయ చేస్తున్నాడో ఏమో ? రోజుకో ఎమ్మెల్యే మద్దతు తీసుకుంటున్నాడు.

తాజాగా తంజావూరు ఎమ్మెల్యే రంగసామి కూడా టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 36కు చేరింది. ఎడప్పాడి పళనిసామి వెంట ఉన్న ఎమ్మెల్యేలను తన దారికి తెచ్చుకోవడానికి టీటీవీ దినకరన్ చాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Thanjavur MLA rangasamy has extended his support to Dinakaran.

ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎరవేస్తున్న టీటీవీ దినకరన్ తన వైపు తిప్పుకుంటున్నారని సమాచారం. ఇప్పటి వరకు 36 మంది అన్నాడీఎంకే (అమ్మ వర్గం) ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్న టీటీవీ దినకరన్ ఎడప్పాడి పళనిసామికి పగలే చుక్కలు చూపిస్తున్నాడు.

తనకు అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) పగ్గాలు అప్పగించకుంటే మీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి వేస్తానని టీటీవీ దినకరన్ తన ఎమ్మెల్యేలతో ఎడప్పాడి పళనిసామిని బెదిరిస్తున్నారు. అయితే మొండి ధైర్యంతో ఎడప్పాడి పళనిసామి మాత్రం టీటీవీ దినకరన్ బెదిరింపులకు లొంగిపోకుండా ముందుకు వెలుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు అయిన తరువాత తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోతాయో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+