బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు గూండాగిరి, నో బెయిల్, ఓన్లీ జైల్, దెబ్బకు గ్యాంగ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: యూబీ సిటీలోని పబ్ లో చిన్న విషయానికి గొడవ పడి యువకుడిని చితకబాదిన కేసులో బెంగళూరులోని శాంతినగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారిస్ కుమారుడు మోహమ్మద్ నలపాడ్ కు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. గూండాగిరి చేసిన ఎమ్మెల్యే కొడుకు జైలుకే పరిమితం అయ్యాడు.

ఆసుపత్రిలోనే చంపేస్తాం

ఆసుపత్రిలోనే చంపేస్తాం

బెంగళూరులోని 63వ సెసన్స్ న్యాయస్థానంలో శుక్రవారం బెయిల్ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. ఆ సమయంలో మోహమ్మద్ నెలపాడ్ పబ్ లో విద్వత్ మీద దాడి చెయ్యడమే కాకుండా మాల్యా ఆసుపత్రికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక్కడే చంపేస్తామని బెదరించి మళ్లీ అక్కడా దాడి చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

Recommended Video

Congress MLA's Son Sase : Reactions
తండ్రి అధికారం

తండ్రి అధికారం

మోహమ్మద్ తండ్రి హ్యారీస్ ఎమ్మెల్యే అని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు నాశనం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అంతే కాకుండా విద్వత్ మీద మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.

ఎమ్మెల్యే హామీ

ఎమ్మెల్యే హామీ

మోహమ్మద్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని, సాక్షాలు నాశనం చెయ్యడని, పోలీసుల విచారణకు సహకరిస్తాడని అతని తరపు న్యాయవాది కోర్టులో మనవి చేశారు. ఇప్పటికే విచారణకు సహకరిస్తామని ఎమ్మెల్యే హ్యారీస్ లిఖితపూర్వకంగా బహిరంగ లేఖ రాసి హామీ ఇచ్చారని ఆరోపి న్యాయవాది కోర్టులో మనవి చేశారు.

ఎంతగా దాడి చేశారంటే

ఎంతగా దాడి చేశారంటే

రెండు వారాలు అయినా ఇంత వరకూ విద్వత్ కోలుకోలేదంటే ఎంతగా దాడి చేశారో అర్థం చేసుకోవాలని బెయిల్ మంజూరు చెయ్యరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో మనవి చేశారు. వాదనలు విన్ని న్యాయమూర్తి పరమేశ్వర ప్రసన్న మోహమ్మద్ తో సహ కేసులోని 7 మంది నిందితులకు బెయిల్ ఇవ్వలేమని తీర్పు చెప్పారు. మోహమ్మద్ తో సహ అతని అనుచరులు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు.

English summary
The 63rd City Civil and Sessions Court Bengaluru rejected Mohammed Nalapad bail application.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X