మహిళను చంపేసి శవాన్ని గంగా నది మధ్యలో విసిరేశారు, ఆ వీడియో వైరల్
గంగా నదిలో పడవలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు నది మద్యలో ఓ మహిళ మృతదేహాన్ని విసిరేస్తున్న వీడియో ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. మహిళను చంపి పడవలో తరలించి గంగా నదిలో పడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు అంటున్నారు.ఈ వీడియోలో నలుగురు నిందితులు పడవలో వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనపడుతున్నాయని పోలీసులు అంటున్నారు. పడవ ముందు ఒక మహిళ మృతదేహాన్ని ఉంచారు. నిందితుల్లో ఒకరు మృతదేహం కోసం మూసి ఉన్న దస్తులను సరిచేస్తున్నాడు. పడవ వేగంగా కదలడం వల్ల బట్టలు గాలికి ఎగిరిపోతున్నాయి.

మహిళ మీద మూసిన బట్టటలు సర్దుతున్న ఆ వ్యక్తికి మరో ఇద్దరు సహాయం చేశారు. పొంగి ప్రవహిస్తున్న గంగా నది మధ్యలోకి పడవ వెళ్లడంతో నలుగురు మహిళలు మృతదేహాన్ని పైకి ఎత్తి ఆ నదిలోకి వేసేశారు. మహిళమృతదేహాన్ని పడేసిన దగ్గర్లోనే బోటు యూటర్న్ తీసుకుంది. మహిళ మృతదేహం నీటిలో మునిగిపోవడంతో నిందితులు తిరిగి ఒడ్డుకు వచ్చారు. ఇదంతా తెల్లవారుజామున జరిగింది.

ఈ ఘటనను పడవలో ఉన్నవారు మొబైల్ లో రికార్డు చేశారు. అయితే అకస్మాత్తుగా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. నిందితుల తీరు చూస్తుంటే గతంలో కూడా ఇలాంటి ఎన్నో చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కావున తగు విచారణ జరిపి నిందితులను కనిపెట్టాలని నెటిజన్లు పోలీసులకు మనవి చేస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు గంగా నదిలో శవాలుగా కలిసిపోయారా ? లేదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి మరో ఘటన జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పలువురు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, పలువురు ఈ సంఘటనను ఖండిస్తూ, కేసును దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ వీడియోలో ఉన్న నలుగురి గుర్తింపు కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహిళను మరోచోట హత్య చేసి గంగా నదిలో ఆమె శవాన్ని పడేసే అవకాశం ఉందని, ఇది పరువు హత్య , కాదా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications